Thursday, June 16, 2011

రంగూన్ రౌడి -- 1979




సంగీతం::JV.రాఘవులు
రచన::వేటూరి
గానం::P.సుశీల
రాగం::శివరంజని

ఓ జాబిలీ..వెన్నెలాకాశం..ఉన్నదే నీకోసం
ఓ జాబిలీ..వెన్నెలాకాశం..ఉన్నదే నీకోసం
ఎదురు చూసింది..నిదుర కాచింది...
ఎదురు చూసింది..నిదుర కాచింది..కలువ నీకోసమే
వెలుగువై రావోయీ..వెలుతురే తేవోయీ..

ఓ జాబిలీ..వెన్నెలాకాశం..ఉన్నదే నీకోసం
ఝుం ఝుం ఝుం..ఝుం ఝుం ఝుం
ఝుం ఝుం ఝుం..ఝుం ఝుం ఝుం

నువ్వులేక..నవ్వలేక..ఎందరున్నా ఎవరులేక
జంటగాని తోడులేక..ఒంటిగానే నుండలేను
స్నేహదీపాలూ..ఊ..
స్నేహదీపాలు..వెలగనీచాలు
చీకటేలేదోయీ..
వెలుగువై..రావోయీ..వెలుతురే తేవోయీ

ఓ జాబిలీ..వెన్నెలాకాశం..ఉన్నదే నీకోసం
ఝుం ఝుం ఝుం..ఝుం ఝుం ఝుం
ఝుం ఝుం ఝుం..ఝుం ఝుం ఝుం

గువ్వలాగ నువ్వురాగ..గూడునవ్వే..గుండెనవ్వే
వేకువల్లే నీవురాగా..చీకటంతా చెదరిపోయే
తుడిచి కన్నీళ్ళూ..ఊ..తుడిచి కన్నీళ్ళూ
కలిసినూరేళ్ళు..జతగ ఉందామోయీ...
వెలుగువే నీవోయీ..వెలుతురేకావోయీ..
ఓ జాబిలీ..వెన్నెలాకాశం..ఉన్నదే నీకోసం
ఝుం ఝుం ఝుం..ఝుం ఝుం ఝుం
ఝుం ఝుం ఝుం..ఝుం ఝుం ఝుం

No comments: