Thursday, June 16, 2011

రంగూన్ రౌడి--1979::శివరంజని::రాగం




















సంగీతం::JV.రాఘవులు
రచన::వేటూరి
గానం::SP.బాలు,P.సుశీల


రాగం::శివరంజని


ఓ జాబిలీ..వెన్నెలాకాశం..ఉన్నదే నీకోసం
ఓ జాబిలీ..వెన్నెలాకాశం..ఉన్నదే నీకోసం
ఎదురు చూసింది..నిదుర కాచింది..కలువ నీకోసమే
వెలుగువై రావోయీ..వెలుతురే తేవోయీ

ఓ జాబిలీ..వెన్నెలాకాశం..ఉన్నదే నీకోసం
ఝుం ఝుం ఝుం .. ఝుం ఝుం ఝుం
ఝుం ఝుం ఝుం..ఝుం ఝుం ఝుం

కదలిపోయే కాలమంతా నిన్ను నన్నూ నిలిచి చూసే
కలలు కన్న కౌగిలింత వలపు తీపి వలలు వేసే
భ్రమర నాదాలూ..
భ్రమర నాదాలు ప్రేమ గీతాలై ప్రమళించేనోయీ
పున్నమై రావోయీ..నా పున్నెమే నీవోయీ

ఓ జాబిలీ..వెన్నెలాకాశం..ఉన్నదే నీకోసం
ఝుం ఝుం ఝుం..ఝుం ఝుం ఝుం
ఝుం ఝుం ఝుం..ఝుం ఝుం ఝుం

నవ్వులన్నీ పువ్వులైనా నా వసంతం నీకు సొంతం
పెదవి దాటీ ఎదను మీటే ప్రేమబంధం నాకు సొంతం
ఇన్ని రాగాలూ..ఊ...
ఇన్ని రాగాలు నీకు అందించి రాగమే నేనోయీ
అనురాగమే నీవోయీ..అనురాగమే నీవోయీ

ఓ జాబిలీ..వెన్నెలాకాశం..ఉన్నదే నీకోసం
ఝుం ఝుం ఝుం..ఝుం ఝుం ఝుం
ఝుం ఝుం ఝుం..ఝుం ఝుం ఝుం

No comments: