Saturday, June 28, 2014

ఎం.ఎల్.ఏ--1957



సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు 
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల, జానకి ( ఎస్. జానకి తొలి పరిచయము) 
తారాగణం::జగ్గయ్య,గుమ్మడి,సావిత్రి,గిరిజ,రమణమూర్తి,పెరుమాళ్ళు,నాగభుషణం

పల్లవి::

ఇదేనండి ఇదేనండి..భాగ్యనగరం
మూడు కోట్ల..ఆంధ్రులకు 
ముఖ్యపట్టణం..ముఖ్యపట్టణం
ఇదేనండి ఇదేనండి..భాగ్యనగరం
మూడు కోట్ల..ఆంధ్రులకు 
ముఖ్యపట్టణం..ముఖ్యపట్టణం

చరణం::1

పాలించెను గోలుకొండ..కులీకుతుబ్ షాహి
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
పాలించెను గోలుకొండ కులీకుతుబ్ షాహి
భాగమతి అతని యొక్క ముద్దుల దేవి
ప్రేయసికై కట్టినాడు..పెద్ద ఊరు
ప్రేయసికై కట్టినాడు..పెద్ద ఊరు
ఆ ఊరే ఈనాడు హైదరబాదు..ఊ..ఊ..ఊ

ఇదేనండి..ఇదేనండి
ఇదేనండి ఇదేనండి..భాగ్యనగరం
మూడు కోట్ల..ఆంధ్రులకు 
ముఖ్యపట్టణం..ముఖ్యపట్టణం

చరణం::2

అలనాడు వచ్చెనిట..మహంమారి
ఈ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ
అలనాడు వచ్చెనిట..మహంమారి
అల్లా దయవల్ల..ఆ పీడ పోయినాది
ఆ గండం తప్పిందని గుర్తు నిలిపినారు
ఆ గండం తప్పిందని గుర్తు నిలిపినారు
ఆ గుర్తే అందమైన..చార్మినారు..ఊ..ఊ..ఊ 

ఇదేనండి..ఇదేనండి
ఇదేనండి ఇదేనండి..భాగ్యనగరం
మూడు కోట్ల..ఆంధ్రులకు 
ముఖ్యపట్టణం..ముఖ్యపట్టణం 

చరణం::3

ఇది పాడు పడిన..గోలుకొండకోట
శ్రీరాముడు కనుపించే..తానీషాదీ తోట
ఆఆ..ఆఆ..ఆఆ..ఆఆ..
ఇది పాడు పడిన..గోలుకొండకోట
శ్రీరాముడు కనుపించే..తానీషాదీ తోట
భద్రాద్రి రామదాసు..బందిఖానా..ఆ
భద్రాద్రి రామదాసు..బందిఖానా..ఆ
చూడండి యిదిగో..ఓ..ఓ..ఓ..ఓ
చూడండి యిదిగో..ఓ..ఈ కోటలోనా

ఇదేనండి..ఇదేనండి
ఇదేనండి ఇదేనండి..భాగ్యనగరం
మూడు కోట్ల..ఆంధ్రులకు 
ముఖ్యపట్టణం..ముఖ్యపట్టణం

చరణం::4

అలనాడిది తెనుగుతల్లి అందమైన తోట
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
అలనాడిది తెనుగుతల్లి అందమైన తోట
ఆంధ్ర శౌర్య వాహినులే పారినవీచోట
ఔరంగజేబు అసూయచే దాడి వెడలినాడట..ఆ
ఔరంగజేబు అసూయచే దాడి వెడలినాడట
కోట పట్టుకొనగ మరియేమో పట్టీనాడట..ఆ

ఇదేనండి..ఇదేనండి
ఇదేనండి ఇదేనండి..భాగ్యనగరం
మూడు కోట్ల..ఆంధ్రులకు 
ముఖ్యపట్టణం..ముఖ్యపట్టణం

చరణం::5

వింత వస్తుశాలలు విశాలమగు వీధులు..ఊ..ఊ..ఊ
వింత వస్తుశాలలు విశాలమగు వీధులు
విద్యాలయ భవనాలు..ఉద్యాన వనాలు
కనుల కింపు చేసే..కమ్మని నగరం
కనుల కింపు చేసే..కమ్మని నగరం
భరత మాత జడలోనే..పసిడి నాగరం

ఇదేనండి..ఇదేనండి  
ఇదేనండి ఇదేనండి..భాగ్యనగరం
మూడు కోట్ల..ఆంధ్రులకు 
ముఖ్యపట్టణం..ముఖ్యపట్టణం

No comments: