Thursday, June 26, 2014

ప్రేమతరంగాలు--1980


సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల 

పల్లవి::

ఉ..హు..ఆ..ఆ..ఆ
లా..లా..లా..లా 
మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే
బ్రతుకు ఒక మధుమాసం

చరణం::1

ఈ తోటలో..ఏ తేటిదో
తొలిపాటగా..వినిపించెను
ఎద...కదిలించెను

ఆ పాటనే నీ కోసమే
నే పాడినా వినిపించునా నేస్తమా
వికసింతువా వసంతమా
మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే
బ్రతుకు ఒక మధుమాసం

చరణం::2

ఈ చీకటి..నా లోకము
నీ రాకతో..మారాలిరా 
కథ...మారాలిరా
ఆ మార్పులో..నా తూర్పువై
ఈ మాపునే వెలిగింతువా నేస్తమా
వికసింతువా..వసంతమా
మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
ఆ మధురిమకు పులకించే
బ్రతుకు ఒక మధుమాసం
ఆహా..హా..ఆ..ఆ..ఉమ్మ్..ఉమ్మ్

No comments: