సంగీతం::M.M.కీరవాణి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు, K.S.చిత్ర, కోరస్
పల్లవి::
పువ్వూ నవ్వే..అఆఆఆ
గువ్వానవ్వే..అఆఆఆ
పువ్వూ నవ్వే గువ్వానవ్వే
మువ్వనవ్వే గవ్వా నవ్వే
రవ్వల బొమ్మ నవ్వదేమే..అఆఆఆ
మానూ నవ్వే మబ్బూ నవ్వే
మాటా నవ్వే మనసూ నవ్వే
మాలచ్చిమీ నవ్వదేమే
ఆరారారరా..అరారారారార
చిలుకకు చీరే కడితే హైలెస్సో
మొలకకు చిగురే పుడితే హైలెస్సో
అది ఎవరెవరెవమ్మా..ఇదిగిదిగోమ్మా
అది ఎవరెవరెవమ్మా..ఇదిగిదిగోమ్మా
పువ్వు గువ్వా సువ్వీ అంటే
మానూ మబ్బూ రివ్వూ మంటే
రవ్వలబొమ్మా నవ్వాలమ్మా
రాచనిమ్మా నవ్వాలమ్మా
అరారరరరరరరా..ఆ
హైలెస్సో...హైలెస్సో
హైలెస్సో...హైలెస్సో
చరణం::1
ఆ ఆ ఆ..ఆ ఆ ఆ
కోయిలాలో..కూయవేమే
కొండగాలో..వీచవేమే
అరారరరరరరా..ఆ
కుహూ కుహూ తప్ప కోయిలమ్మకేం తెలుసు..అ..ఆ
ఓహోం.. ఓహోం తప్ప కొండగాలికేం తెలుసు..అ..ఆ
గజ్జకట్టుకోకున్నా ఘల్లు ఘల్లు మంటుంది ఏం అడుగు
నువ్వే అడుగు
ఎవరిదా అడుగు..నాకేం తెలుసు
ఎవరిదా అడుగు..నాకేం తెలుసు
పోనీ..
గొంతు దాటిరాకున్నా గుండె ఊసు చెబుతుందీ..
ఏ పలుకు.. అమ్మా పలుకు
నీఈ..పలుకు..ఊహు నీ..ఈ..పలుకు
ఊహు..నీ..ఈఈ పలుకు
కామాక్షమ్మ కరుణించిందో మీనాక్షమ్మ వరమిచ్చిందో
రవ్వలబొమ్మ నవ్విందమ్మా రాచనిమ్మ నవ్విందమ్మా
ఆరరరరరరరరరా..ఆ
చరణం::2
హోయ్..హోయ్..హోయ్..హోయ్..ఆఆఆఅఆఆఆ
నవ్వులేమో..ఓ..దివ్వెలాయే..నడకలేమో..ఓ..మువ్వలాయే
ఆరారారారారారాఅ..ఆ
ఆలమందలు కాసిన వాడేనా..అ.ఆ
పాలబిందెలు మోసినవాడేనా..అ..ఆ
ఏమి కవితలల్లాడమ్మా..ఎన్ని కళలు నేర్చాడమ్మా
ఏమి కవితలల్లాడమ్మా..ఎన్ని కళలు నేర్చాడమ్మా
కనులముందు నీవుంటే కవిత పొంగి పారిందమ్మా
మాటా నీదే పాటా నీదే మనసూరించే ఆటా నీదే
పున్నమిరెమ్మా పుట్టినరోజు వెన్నెల చిందూ నాదే నాదే
ఆరారారారారాఅ..ఆ
ఆఆ..ఆఆఆఆఆ..అ..ఆ..రారారారారారా..అ..ఆ
ఓహోహో..ఓఓఓఓ..హో..హో..
No comments:
Post a Comment