సంగీతం::V. కుమార్
రచన::రాజశ్రీ
గానం::P.సుశీల
తారగణం::శోభన్‌బాబు,రామకృష్ణ,ప్రభాకరరెడ్డి,వాణిశ్రీ,లత,గీతాంజలి,గుమ్మడి
పల్లవి::
బాబూ..చిన్నారి బాబూ
బాబూ..చిన్నారి బాబూ
నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను
నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను
కడుపున కన్నీటి సెగలు దాచుకున్నాను
బాబూ చిన్నారి బాబూ
చరణం::1
మబ్బుల్లొ ఎగిరేటి మీ నాన్న
ఆ మబ్బుల్లో కలిశాడు ఓ నాన్నా
మబ్బుల్లొ ఎగిరేటి మీ నాన్న
ఆ మబ్బుల్లో కలిశాడు ఓ నాన్నా
అతడు లేని నా బ్రతుకే చీకటిరా
ఆ చీకటిలో నీ నవ్వే దీపికరా
బాబూ..చిన్నారి బాబూ
చరణం::2
అమ్మా అని ఒక్కసారి నువ్వంటే
నా అణువణువున ఆనంద గోదావరి
అమ్మా అని ఒక్కసారి నువ్వంటే
నా అణువణువున ఆనంద గోదావరి
నాన్నేడని ముందు ముందు అడిగితే
నా గుండెల్లో కన్నీటి కావేరి
బాబూ..చిన్నారి బాబూ
చరణం::3
నెలవంకలా నీవు పెరగాలి
నా కలలన్నీ నీ కళలై వెలగాలి
నెలవంకలా నీవు పెరగాలి
నా కలలన్నీ నీ కళలై వెలగాలి
ఆ వెలుగే నా కంటి వెలుగు కావాలి
అది చూసి మీ నాన్న మురిసి పోవాలి
బాబూ..చిన్నారి బాబూ
నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను
నిన్నుచూసి నేను బ్రతికి వున్నాను
కడుపున కన్నీటి సెగలు దాచుకున్నాను
బాబూ చిన్నారి బాబూ
No comments:
Post a Comment