Monday, June 15, 2015

కన్నతల్లి--1972



సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::P.సుశీల 
తారాగణం::శోభన్‌బాబు,సావిత్రి,చంద్రకళ,నాగభూషణం,రాజబాబు,సంధ్యారాణి,M.ప్రభాకర్‌రెడ్డి 

పల్లవి::

తీయ తీయని..నవ్వే నువ్వూ
తేనెలూరే..పువ్వే నువ్వూ
నన్ను కన్న తల్లివి..నువ్వూ
నా పున్నెము పండిన..పంటవు నువ్వూ   
తీయ తీయని..నవ్వే నువ్వూ
తేనెలూరే..పువ్వే నువ్వూ
నన్ను కన్న..తల్లివి నువ్వూ
నా పున్నెము పండిన..పంటవు నువ్వూ
తీయ తీయని..నవ్వే నువ్వూ 

చరణం::1

దేవతలిచ్చిన..దీవెనలన్నీ
తెచ్చిన చల్లని..పాపవు నువ్వూ
దేవతలిచ్చిన..దీవెనలన్నీ
తెచ్చిన చల్లని..పాపవు నువ్వూ
తీరిపోని..పూర్వజన్మబంధమేదో
తీరిపోని..పూర్వజన్మబంధమేదో 
తీసుకొచ్చి నింపినావు..నా ఒడిలో    
తీయ తీయని..నవ్వే నువ్వూ
తేనెలూరే..పువ్వే నువ్వూ
తీయ తీయని..నవ్వే నువ్వూ

చరణం::2

నింగిలోన..తారకలన్నీ
నీ కన్నులలో.మెరిసినవీ
నింగిలోన..తారకలన్నీ
నీ కన్నులలో..మెరిసినవీ
చందమామ..చలువంతా
చందమామ..చలువంతా
నీ నవ్వులలోనే..యిమిడినది 
ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ 
ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ       
తీయ తీయని..నవ్వే నువ్వూ
తేనెలూరే..పువ్వే నువ్వూ
తీయ తీయని..నవ్వే నువ్వూ 

చరణం::3
       
నా యింటి దీపము..నిలిపినావు
నా కంటి పాపవై..వెలసినావు
నా యింటి దీపము..నిలిపినావు
నా కంటి పాపవై..వెలసినావు
కన్నతల్లి కలలకు..కమ్మని రూపం
కన్నతల్లి కలలకు..కమ్మని రూపం
యిచ్చిన బంగారు..బొమ్మవు నీవు   
తీయ తీయని..నవ్వే నువ్వూ
తేనెలూరే..పువ్వే నువ్వూ
నన్ను కన్న..తల్లివి నువ్వూ 
నా పున్నెము పండిన..పంటవు నువ్వూ
తీయ తీయని..నవ్వే నువ్వూ..ఊఊ 

No comments: