సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::K.J.ఏసుదాస్, P.సుశీల
తారాగణం::రాజ్‌కుమార్,రేవతి,సుమిత్ర.
పల్లవి::
ఎవ్వరిది..ఈ పిలుపు
ఎక్కడిది..ఈ వెలుగు
ఎవ్వరిది ఈ పిలుపు
ఎక్కడిది ఈ వెలుగు
నీవై వెలిగినది..ఈ
నీలో పలికినది..ఈ..ఈ
నీవై వెలిగినది..ఈ
నీలో పలికినది
పిలిచిన పిలుపెల్లా
నాదలై..ఆ మ్రోగినవి
ఆ రాగాలై..సాగినవి
మానసవీణై వెలసినది
ఎవ్వరిది ఈ వీణా
ఎక్కడిది ఈ జాణా
నాలోని..నీ రూపమే
ఆ..ఆ..నాలోని..నీ భావమే
ఎవ్వరిది ఈ పిలుపు
ఎక్కడిది ఈ వెలుగు
నీవై వెలిగినదీ
నీలో పలికినది
చరణం::1
చుక్కల్నీ ఒలిచీ..చక్కంగా మలిచి
నీ కంఠహారాన్ని చేయించనా..ఆ..ఆ
సూర్యుణ్ణి అడిగి..కిరణాలు తొడిగి
నీ ముంగిటే ముగ్గు వేయించనా..ఆ..ఆ
ప్రాణాలు ఐదు..నీలోనా ఖైదై
ఆరోది నీవై జీవించనా
ప్రాణాలు ఐదు..నీలోనా ఖైదై
ఆరోది నీవై జీవించనా
ఎవ్వరిది..ఈ వీణా
ఆ..ఎక్కడిది..ఈ జాణా
నాలోని నీ రూపమే
ఆ..ఆ..నాలోని నీ భావమే
చరణం::2
తనువెల్లా మనసై..మనసెల్లా కనులై
నెలలన్నీ దినమల్లే గడిపేయనా
నాకున్న రుచులు..నీకున్నా కళలు
కలబోసి ప్రతిరోజు విందివ్వవా
నేనివ్వగలది..ఈ..ఏ జన్మములది
ఇక ముందు ఎంతో..మిగిలున్నది
ఎవ్వరిది ఈ వీణా
ఎక్కడిది ఈ జాణా
నాలోని నీ రూపమే
ఆ..ఆ..నాలోని నీ భావమే
ఎవ్వరిది ఈ పిలుపు
ఎక్కడిది ఈ వెలుగు
నీవై వెలిగినదీ..ఈ
నీలో పలికినది..ఈ
నీవై వెలిగినదీ..ఈ
నీలో పలికినది
2 comments:
ee paata paata vintunte okkasaarigaa chinnappudu radio...udayam 9 ki paatalu..school..anni gurtochaayi :) thanks for posting,
Nitya
hi nitya garu
meeku song nachinanduku chaalaa thanks andi mee naa blog loni paatalu nachinte
Followerkavochukadandi ...meeku istamuntene sumaa
meekemaina paatalu kavaalante adagandi vestanu
Post a Comment