Wednesday, May 08, 2013

ఆడవాళ్ళు మీకు జోహార్లు--1981














సంగీతం::K.V. మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణం రాజు,చిరంజీవి,రాజేంద్ర ప్రసాద్, జయసుధ, సరిత

పల్లవి::

ఆడాళ్ళు..మీకు జోహార్లు
ఓపిక..ఒద్దిక..మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు
ఆడాళ్ళు..మీకు జోహార్లు
ఓపిక..ఒద్దిక..మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు
ఆడాళ్ళు..మీకు జోహార్లు

చరణం::1

ఒకరు దబ్బ పండు..ఒకరు పనస పండు
ఒకరిది కనపడే చక్కదనం..ఒకరిది కానరాని తియ్యదనం
ఒకరు దబ్బ పండు..ఒకరు పనస పండు
ఒకరిది కనపడే చక్కదనం..ఒకరిది కానరాని తియ్యదనం

ఇద్దరి మంచితనం..నాకు ఇస్తుంది ప్రాణం
ఇది తలచుకుంటే..మతిపోతుంది ఈదినం

ఆడాళ్ళు..మీకు జోహార్లు

చరణం::2

రవ్వంత పసుపు కాసంత కుంకుమకు
మగవాడిని నమ్మడం మనిషి చేయడం
మనసు నిదర లేపడం మమత నింపడం
రవ్వంత పసుపు కాసంత కుంకుమకు
మగవాడిని నమ్మడం మనిషి చేయడం
మనసు నిదర లేపడం మమత నింపడం

ఆ పనిలో బ్రతుకంతా అరగదీయడం
కన్నీళ్ళే నవ్వుగా మార్చుకోవడం
ఇదే పనా మీకూ..ఇందుకే పుట్టారా

ఆడాళ్ళు..మీకు జోహార్లు
ఓపిక.. ఒద్దిక..మీ పేర్లు
మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్ళు
ఆడాళ్ళు..హ హ హ హ



AdavaaLLu meeku jOhaarlu--1981
Music::K.V. Mahadaevan
Lyricist::Achaarya Atraeya
Singer::S.P.baalu
Cast::Krishnamraju , Chiranjeevi , Raajendraprasad , Jayasudha , Sarita.

::1

Adavallu..meeku johaarlu
opika..oddika..mee perlu
meeru okarikante okaru goppollu

Adavallu..meeku johaarlu

opika..oddika..mee perlu
meeru okarikantae okaru goppollu

Adavallu..meeku johaarlu


::2

okaru dabba pandu..okaru panasa pandu
okaridi kanapadae chakkadanam..okaridi kaanaraani tiyyadanam

okaru dabba pandu..okaru panasa pandu
okaridi kanapadae chakkadanam..okaridi kaanaraani tiyyadanam


iddari manchitanam..naaku istundi praanam
idi talachukuntae..matipotundi eedinam


Adavallu..meeku johaarlu


::3

ravvanta pasupu kaasanta kumkumaku
magavaadini nammadam manishi chaeyadam
manasu nidara laepadam mamata nimpadam
ravvanta pasupu kaasanta kumkumaku
magavaadini nammadam manishi chaeyadam
manasu nidara lepadam mamata nimpadam

aa panilo bratukantaa aragadeeyadam
kanneelle navvugaa maarchukovadam
ide panaa meekoo..induke puttaaraa



Adavallu..meeku johaarlu
opika..oddika..mee perlu
meeru okarikante okaru goppollu


AdaaLLu..ha ha ha ha...



No comments: