Wednesday, May 08, 2013

బంగారు కుటుంబం--1971


సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల 
తారాగణం::కృష్ణ,విజయనిర్మల,రాజశ్రీ,రామకృష్ణ,గుమ్మడి,అంజలీదేవి 

పల్లవి::

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆ హా హా..ఆ ఆ ఆ ఆ
పిల్లగాలి ఊయలలో
పల్లవించు ఊహలలో 
ఉందామా నీవే నేనుగా                           
పిల్లగాలి ఊయలలో
పల్లవించు ఊహలలో 
ఉందామా నీవే నేనుగా                           

చరణం::1

నీలినింగి అంచులదాకా
కేలుసాచి పోదామా
పాలమబ్బు పల్లకిలోన
పరవశించి పోదామా
పరిమళాల దారులలోనా
మరులు పెంచుకొందామా
మరకతాల కోనలలోన
మనసు కలుపుకొందామా
పగలుకాయు వెన్నెలలో
పలవరించు కన్నులలో
ఉందామా నీవే నేనుగా                        

చరణం::2

చిలిపివాగు తరగలలోనా
పిలుపులేవో విందామా 
పులకరించు నురుగులలోనా
వలపుపొంగు కందామా
సొంపులొలుకు సందెలలోన
కెంపులేరుకొందామా
పలుకలేని గుండెలలోన
పాటలల్లు కొందామా
వాడిపోని రాతిరిలో 
వీడిపోని కౌగిలిలో
ఉందామా నీవే నేనుగా   
పిల్లగాలి ఊయలలో
పల్లవించు ఊహలలో
ఉందామా నీవే నేనుగా                           

No comments: