సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు
పల్లవి::
బండి కాదు మొండి..ఇది సాయం పట్టండి
పెట్రోల్ ధర మండుతోంది..ఎడ్లు కట్టండి
గోపాలా..గోవిందా..రావయ్యా..ఆ..లాగయ్యా
బండి కాదు మొండి..ఇది సాయం పట్టండి
పెట్రోల్ ధర మండుతోంది..ఎడ్లు కట్టండి
గోపాలా..గోవిందా..రావయ్యా..ఆ..లాగయ్యా
ఎక్కడికి వెళ్ళాలయ్యా..వెళ్ళినాక చెప్తానయ్యా
చెప్పకుంటె ఎట్టాగయ్యా..చెప్పుకుంటె తంటాలయ్యా
ఎక్కడికి వెళ్ళాలయ్యా..వెళ్ళినాక చెప్తానయ్యా
చెప్పకుంటె ఎట్టాగయ్యా..చెప్పుకుంటె తంటాలయ్యా
బండి కాదు మొండి..ఇది సాయం పట్టండి..అవునా
పెట్రోల్ ధర మండుతోంది..ఎడ్లు కట్టండి
గోపాలా..గోవిందా..రావయ్యా..ఆ..లాగయ్యా
చరణం::1
అరె ఇంగ్లాండు మహరాణి ఈ డొక్కు కార్లోనె ఊరేగి వెళ్ళిందటా..హా
అది చూశాకా మోజెక్కీ మైసూరూ మహరాజ దర్జాగ కొన్నాడటా..హహహహా
అది ఏలమేసారు..నాన్న పాట పాడారు..ఏ గాణి ఇచ్చారు..ఏగించుకొచ్చారు
ఇది పుట్టాక ఇట్టాగే నెట్టించు కుంటూనే నెట్టింది..ఇన్నేళ్ళటా
ఇది పుట్టాక ఇట్టాగే నెట్టించు కుంటూనే నెట్టింది..ఇన్నేళ్ళటా
అదే అలవాటు అయ్యిందటా..ఆ
అరె ఊగిపోతుంది..అసలు ఊడిపోతుంది
ఒట్టి బొమికెలేనండి..దీన్ని మోసుకెళ్ళండి
మీ పెళ్ళిళ్ళు జరగాలిరా..నాయనా
మీరు ఊరేగి వెళ్ళాలిరా..ఇది జగన్నాధ రథమేనురా
ఎక్కడికి వెళ్ళాలయ్యా..వెళ్ళినాక చెప్తానయ్యా
చెప్పకుంటె ఎట్టాగయ్యా..చెప్పుకుంటె తంటాలయ్యా
బండి కాదు మొండి ఇది సాయం పట్టండి.. అవునూ
పెట్రోల్ ధర మండుతోంది..ఎడ్లు కట్టండి
గోపాలా..గోవిందా..రేయ్ నాయ్నా
గోపాలా..రా..రా..సాయం..పట్రా
నెట్టు..నెట్టు..నెట్టు..నెట్టు
చరణం::2
అరె కన్నాను పిల్లల్ని అరడజను కోతుల్ని
చిన్నారి సైన్యాన్నీ..పేరెట్టాను రామదండనీ
అరె లంక కెళ్ళింది..రాణి తోటి వచ్చింది
అరె బ్రిడ్జి కట్టింది..ఇంత ఎవరు చేసింది
మా రామదండు నెదిరించి ఏ సైన్యం
ఏనాడు గెలిచింది బతికింది..హ హా
ఇది ఊరంతా..తెలిసిందీ
ఈ కారు చూడండి..నకరాలు చేస్తోంది
దీనంతు చూడండి..ఒక్క తోపు తోయండి
అరె ఈ కారు కొన్నందుకూ..ఊ
నేనిందర్ని కన్నందుకూ..ఊ
సరిపోయారు..తోసేందుకూ
ఎక్కడికి వెళ్ళాలయ్యా..వెళ్ళినాక చెప్తానయ్యా
చెప్పకుంటె ఎట్టాగయ్యా..చెప్పుకుంటె తంటాలయ్యా
ఎక్కడికి వెళ్ళాలయ్యా..వెళ్ళినాక చెప్తానయ్యా
చెప్పకుంటె ఎట్టాగయ్యా..చెప్పుకుంటె తంటాలయ్యా
బండి కాదు మొండి ఇది సాయం పట్టండి..హా
పెట్రోల్ ధర మండుతోంది..ఎడ్లు కట్టండి
గోపాలా..ఆ..గోవిందా..ఆ..రావయ్యా..ఆ..లాగయ్యా..ఆ
No comments:
Post a Comment