Wednesday, May 21, 2008

నోము--1974



సంగీతం::మాధవపెద్ది సత్యం
రచన::దాశరథి
గానం::SP.బాలు P.సుశీల

తారాగణం::రామకృష్ణ, చంద్రకళ,జయసుధ,కె.వి.చలం,శరత్‌బాబు

కలిసే కళ్ళలోనా..కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
కలిసే కళ్ళలోనా..కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
కలిసే కళ్ళలోనా....... !!

పెరిగీ తరిగేను నెలరాజూ..
వెలుగును నీ మోము ప్రతి రోజూ
పెరిగీ తరిగేను నెలరాజూ..
వెలుగును నీ మోము ప్రతి రోజూ
ప్రతి రేయీ పున్నమిలే నీతో ఉంటే

!! కలిసే కళ్ళలోనా..కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
కలిసే కళ్ళలోనా...... !!


ఎదురుగ చెలికాణ్ణి చూసానూ
ఎంతో పులకించి పోయానూ
ఎదురుగ చెలికాణ్ణి చూసానూ
ఎంతో పులకించి పోయానూ
ఈ పొందు కలకాలం నే కోరేనూ

!! కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా
కలిసే కళ్ళలోనా...... !!


కౌగిలి పిలిచేను ఎందుకనీ
పెదవులు వణికేను దేనికనీ
కౌగిలి పిలిచేను ఎందుకనీ
పెదవులు వణికేను దేనికనీ
మనలోని పరువాలు పెనవేయాలనీ

!! కలిసే కళ్ళలోనా
కురిసే పూల వానా
విరిసెను ప్రేమలు హృదయానా .....!!

No comments: