Monday, May 19, 2008

రామకృష్ణులు--1978



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య-ఆత్య్రేయ
గానం::P.సుశీల,V.రామకృష్ణ
తారాగణం::N.T.రామారావు,అక్కినేని, జయసుద, జయప్రద
     
పల్లవి::

దుప్పట్లో దూరాక..దూరమేముంది
గుప్పిళ్ళు తెరిచాక..గుట్టు ఏముంది
మనసేమో మల్లెపూల..మంచమౌతుంది
అహ..మనసేమో మల్లెపూల మంచమౌతుంది
వయసును వయసే..వాటేసుకుంటుంది

దుప్పట్లో..ఓ
హొయ్..హొయ్..హొయ్..హొయ్
దుప్పట్లో దూరాక..దూరమేముంది
గుప్పిళ్ళు తెరిచాక..గుట్టు ఏముంది

చరణం::1

కనబడితేనే చాలని..ఉంటుంది
కనపడగానే..దడ దడ మంటుంది 
ముచ్చట కాస్త..మూగపోతుంది
ముచ్చమటలుగా..ముద్దైపోతుంది

ఓరచూపు చూసుకున్న..చేరనంటుంది
హా చేరువైన చేరలేని..దూరముంటుంది

దుప్పట్లో..హోయ్..హోయ్..హోయ్
దుప్పట్లో దూరాక..దూరమేముంది
గుప్పిళ్ళు తెరిచాక..గుట్టు ఏముంది

చరణం::2

చూస్తుంటేనే..చాలనిపిస్తుంది
చూసిన కొద్ది సొంతమైతే..మేలనిపిస్తుంది
చేయి తగిలితే..ఝల్లుమంటుంది
ఆ సంబరంలో..ఒళ్ళు తాకితే
జల జల..మంటుంది  

అమ్మబాబోయ్..ఎవరేనా చూస్తే
అమ్మబాబోయ్ ఎవ్వరేనా..చూస్తారంటుంది
అంత కన్న పచ్చ జండా..ప్రేమకేముంది

దుప్పట్లో..హా..దుప్పట్లో..హు
దుప్పట్లో దూరాక..దూరమేముంది
గుప్పిళ్ళు తెరిచాక..గుట్టు ఏముంది

చరణం::3

కొన్నాళ్ళంతా కొత్తగ..ఉంటుంది
కొత్త కొత్తగా కోర్కెలు..చెపుతుంది
కొన్నాళ్ళంతా కొత్తగ..ఉంటుంది
కొత్త కొత్తగా కోర్కెలు..చెపుతుంది

మూడుముళ్లకు ముచ్చట..పడుతుంది
ముద్దుల మూటలు..ముడుపే కడుతుంది
ముడుపులిచ్చే మొదటి రాత్రి..రానే వస్తుంది
పొండి మీరు పోకిరంటు..మొండికేస్తుంది

దుప్పట్లో..హోయ్..హోయ్..హోయ్
దుప్పట్లో దూరాక..దూరమేముంది
గుప్పిళ్ళు తెరిచాక..గుట్టు ఏముంది

No comments: