సంగీతం::T.చలపతిరావు
రచన::దాశరథి
గానం::P.సుశీల
తారాగణం::రామకృష్ణ,రాజబాబు,జయసుధ,నాగభూషణం,ప్రభ,జయమాలిని,అల్లు రామలింగయ్య
పల్లవి::
అందే అందాలు..తమలపాకు తోడిమే
పదివేలు..నేనేదింక కోరేదిక లేదు
అందరివోలే అడిగేదాన్ని కాను
కొ౦దరి వోలే కొసరేదాన్ని కాను
ఓ మావ..మావ..మావ..మావ..మావ
ఓహొ బంగారు మావా..ఓహొ బంగారు మావా
ఓహొ బంగారు మావా..ఓహొ బంగారు మావా
చరణం::1
ముక్కూకు ముక్కెర లేక
ముక్కు చిన్నబోయినాది..మావా..మావా
ముక్కూకు ముక్కెర లేక ముక్కు చిన్నబోయినాది
ముద్దుటు౦గరం కుదువాబెట్టీ..ముద్దుటు౦గరం కుదువాబెట్టీ
ముక్కుకు చక్కని ముక్కెర తేరా..మావా..మావా
అంతే నాకు చాలు..తమలపాకు తోడిమే పదివేలు
చరణం::2
నడుమా వడ్డాణ౦ లేక నడుమూ చిన్నబోయినాది
మావా..మావా..మావా..మావా
నడుమా వడ్డాణ౦ లేక నడుమూ చిన్నబోయినాది
నడుమూ...చిన్నబోయినాది
నాణ్యమైన దాన్యం అమ్మీ..నడుముకు వడ్డాణ౦ తేరా
నాణ్యమైన దాన్యం అమ్మీ..నడుముకు వడ్డాణ౦ తేరా..మావా
అంతే నాకు చాలు..తమలపాకు తోడిమే
పదివేలు...నేనేదింక కోరేదిక లేదు
అందరివోలే..అడిగేదాన్ని కాను
కొ౦దరి వోలే..కొసరేదాన్ని కాను
ఓ మావ..మావ..మావ..మావ..మావ
ఓహొ బంగారు మావా..ఓహొ బంగారు మావా
ఓహొ బంగారు మావా..ఓహొ బంగారు మావా
చరణం::3
కాళ్లాకు కడియాలు లేక
కాళ్ళు చిన్నబోయినాయి..మావా..మావా
కాళ్లాకు కడియాలు లేక..కాళ్ళు చిన్నబోయినాయి
కాడి ఎద్దుల నమ్ముకోని
కాడి ఎద్దుల నమ్ముకోని
కాళ్లాకు కడియాలు తేరా..మావా
అంతే నాకు చాలు..తమలపాకు తోడిమే పదివేలు
చరణం::4
పట్టెమంచం పరుపు లేక..మనసూ చిన్నబోయినాది
మావా..మావా..మావా..మావా
పట్టెమంచం పరుపు లేక..మనసూ చిన్నబోయినాది
మనసూ...చిన్నబోయినాది
పంట భూములమ్ముకోని..పట్టెమంచం పరుపూ తేరా
పంట భూములమ్ముకోని..పట్టెమంచం పరుపూ తేరా..మావా
అంతే నాకు చాలు..తమలపాకు తోడిమే పదివేలు..నేనేదింక కోరేదిక లేదు
అందరివోలే అడిగేదాన్ని కాను..కొ౦దరి వోలే కొసరేదాన్ని కాను
ఓ మావ..మావ..మావ..మావ..మావ
ఓహొ బంగారు మావా..ఓహొ బంగారు మావా
ఓహొ బంగారు మావా..ఓహొ బంగారు మావా
No comments:
Post a Comment