Thursday, April 01, 2010

జూదగాడు--1979



















సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::జి.ఆనంద్, సుశీల

పల్లవి::

మల్లెల వేళ..అల్లరి వేళ
మల్లెల వేళ..అల్లరి వేళ
మదిలో మన్మధ..లీల
నీవు నేనైన..వేళ
వుండిపోవాలి..ఇలా ఇలా

మల్లెల వేళ..అల్లరి వేళ
మదిలో మన్మధ..లీల
నీవు నేనైన..వేళ
వుండిపోవాలి..ఇలా ఇలా

చరణం::1

ఒక మధుర మురళి మ్రోగింది
యమునా తటిలో మురళీ రవళి
ఒక రాగమేదొ జుమ్మంది
ఒక రాధ మనసు జల్లంది
బృందావనిలో అందాలొలికే
ఆ రాధా మాధవ రాస క్రీడలే
రసడోలలూగించు వేళ

మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల

చరణం::2

ఒక నింగి వలచి చేరింది
ఒక నేల ముద్దులాడింది
నింగీ నేల ఉరిసీ మెరిసీ
ఒక మబ్బు ఉబ్బి ఉరిమింది
అది పెళ్ళి మేళమయ్యింది
దివిలో మేళం భువిలో తాళం
ఆ మేళ తాళాల మేళవింపులో
జగమెల్ల దీవించు వేళ

మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
నీవు నేనైన వేళ
వుండిపోవాలి ఇలా ఇలా

మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల

No comments: