Thursday, April 01, 2010

జైజవాన్--1970



























సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::కొసరాజు
గానం::P.సుశీల,ఘంటసాల
తారాగణం:: {ANR} అక్కినేని, భారతి, నాగభూషణం, పద్మనాభం, చంద్రకళ, కృష్ణంరాజు

పల్లవి::

పాల బుగ్గల చినదాన్నీ పెళ్ళికాని కుర్రదాన్ని రాజ
పాల బుగ్గల చినదాన్నీ పెళ్ళికాని కుర్రదాన్ని రాజ
ఓరకంట చూడవద్దు..ఒంటిపైచేయ్ వేయవద్దు
తల్లిచాటు పిల్లనయ్యా..అల్లరిపాలూ ఔదునయ్యా

కోడె వయసు చిన్నవాణ్ణీ జోడుకోరి ఉన్నావాణ్ణీ
చదువు ఉందీ సరదాఉందీ సంపాదించే ఛాన్స్ ఉంది
తల్లి తండ్రి కాదన్నా నిను పెళ్ళియాడే ధమ్ము ఉంది
కోడె వయసు చిన్నవాణ్ణీ జోడుకోరి ఉన్నావాణ్ణీ

చరణం::1

బావయ్యో పోవయ్యో..
చదువుకొన్నా చేసేది ఏముంది
గుమాస్తవైతే ఒరిగేది ఏముంది
చదువుకొన్నా చేసేది ఏముంది
గుమాస్తవైతే ఒరిగేది ఏముంది
నీకు వచ్చే నెలజీతాలు సోకులాకే చాలవయ్యా
పాల బుగ్గల చినదాన్నీ పెళ్ళికాని కుర్రదాన్ని

చరణం::2

దొంగచాటు వ్యాపారం కనిపెట్టనే
టాక్స్ లేని డబ్బు బాగా కూడబెట్టానే
లైలానుచీరలు..పౌడర్లు..వాచీలు
లైలానుచీరలు..పౌడర్లు..వాచీలు
బంగారు బిస్కేట్లు..బ్రాందీలు..విస్కీలు
కొల్ల కొల్లగ చేరవేస్తా..చూడుపిల్లా నా తడాక
కోడె వయసు చిన్నవాణ్ణీ జోడుకోరి ఉన్నావాణ్ణీ

పోవయ్యో..దేవయ్యో..
తాగినప్పుడు జల్సాగ ఉంటుంది
దొరికిపోతే జైలే రమ్మంటాది
తాగినప్పుడు జల్సాగ ఉంటుంది
దొరికిపోతే జైలే రమ్మంటాది
దొంగ బ్రతుకు చాలునోయి
తప్పుకోవోయ్ దగులుబాజి

పాల బుగ్గల చినదాన్నీ
పెళ్ళికాని కుర్రదాన్ని

చరణం::3

కల్లాకపటం లేని రైతు బిడ్డనూ
నా కష్టంతో దేశాన్ని బ్రతికిస్తానూ
దేశానికి ప్రానమిచ్చు????----
భరతభూమి పరువు నిలుపు సూరజవాను


జైజవాన్ జైకిసాన్..జైజవాన్ జైకిసాన్
ఇద్దరిద్దరే మొనగాళ్ళు మీరు
మీర్లేనిదే దేశమ్ములేదు
పసిడి పంటలు పండించదవు నీవు
మన స్వతంత్రము నిలబెట్టదవు నీవు
జాతికెల్లా అన్నదాతవు నీవు
మాత్రు భూమికి ప్రాణదాతవు నీవు
వీర పుత్రుని వరింతునయ్యా
వీరపత్నిగ గర్వింతునయ్యా

పాల బుజ్జల చినదాన్నీ
పెళ్ళికాని కుర్రదాన్ని రాజ!!



Jaijavan--1970
Music::S.Rjeswara Rao
Lyrics::Kosaraaju
Singer's::Ghantasala,P.Suseela
Cast::Akkinemi(ANR),Bharati,Nagabhushanam,Padmanabham,Chandrakala,KrishnamRaju


::::1

paala buggala chinadaannii peLLikaani kurradaanni raaja
paala buggala chinadaannii peLLikaani kurradaanni raaja
OrakanTa chUDavaddu..onTipaichEy vEyavaddu
tallichaaTu pillanayyaa..allaripaaluu oudunayyaa

kODe vayasu chinnavaaNNii jODukOri unnaavaaNNii
chaduvu undii saradaaundii sampaadinchE Chaans undi
talli tanDri kaadannaa ninu peLLiyaaDE dhammu undi
kODe vayasu chinnavaaNNii jODukOri unnaavaaNNii

:::2

baavayyO pOvayyO..
chaduvukonnaa chEsEdi Emundi
gumaastavaitE origEdi Emundi
chaduvukonnaa chEsEdi Emundi
gumaastavaitE origEdi Emundi
neeku vachchE nelajeetaalu sOkulaakE chaalavayyaa
paala buggala chinadaannii peLLikaani kurradaanni

:::3

dongachaaTu vyaapaaram kanipeTTanE
Taaks lEni Dabbu baagaa kooDabeTTaanE
lailaanuchiiralu..pouDarlu..vaachiilu
lailaanuchiiralu..pouDarlu..vaachiilu
bangaaru biskETlu..braandiilu..viskeelu
kolla kollaga chEravEstaa..chUDupillaa naa taDaaka
kODe vayasu chinnavaaNNii jODukOri unnaavaaNNii

pOvayyO..dEvayyO..
taaginappuDu jalsaaga unTundi
dorikipOtE jailE rammanTaadi
taaginappuDu jalsaaga unTundi
dorikipOtE jailE rammanTaadi
donga bratuku chaalunOyi
tappukOvOy dagulubaaji

paala buggala chinadaannii
peLLikaani kurradaanni

charaNam::3

kallaakapaTam lEni raitu biDDanuu
naa kashTamtO dESaanni bratikistaanuu
dESaaniki praanamichchu????----
bharatabhUmi paruvu nilupu soorajavaanu


jaijavaan jaikisaan..jaijavaan jaikisaan
iddariddarE monagaaLLu meeru
meerlEnidE dESammulEdu
pasiDi panTalu panDinchadavu neevu
mana swatantramu nilabeTTadavu neevu
jaatikellaa annadaatavu neevu
maatru bhUmiki praaNadaatavu neevu
veera putruni varintunayyaa
veerapatniga garvintunayyaa

paala bujjala chinadaannii
peLLikaani kurradaanni raaja!!


No comments: