సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు
తారాగణం::N.T. రామారావు,లక్ష్మి,అల్లు రామలింగయ్య,ప్రభాకరరెడ్డి,పండరీబాయి,రాజబాబు,రమాప్రభ.
పల్లవి::
నా దేశం భగవద్గీత నా దేశం అగ్నిపునీత సీత
నా దేశం కరుణాంతరంగ నా దేశం సంస్కార గంగ
ఎక్కడి కెళుతూంది దేశం ఎమైపోతుంది
ఎక్కడి కెళుతూంది దేశం ఎమైపోతుంది
హిమశైల శిఖరం పైకా పాతాళ కుహరంలోకా
హిమశైల శిఖరం పైకా పాతాళ కుహరంలోకా
ఎక్కడి కెళుతూంది దేశం ఎమైపోతుంది
చరణం::1
ప్రవచనాల పచ్చిక బయళ్ళలో పన్నాగాల గోతులు
ప్రణాళికల గాదెలకింద దాక్కున్న పందికొక్కులు
ప్రవచనాల పచ్చిక బయళ్ళలో పన్నాగాల గోతులు
ప్రణాళికల గాదెలకింద దాక్కున్న పందికొక్కులు
పావురాళ్ళ ఈకలు తొడుక్కునే ఊరేగే రాబందులు
పావురాళ్ళ ఈకలు తొడుక్కునే ఊరేగే రాబందులు
ఇంకా పొద్దున చూరుకంటుకునే బల్లులై
మధ్యాహ్నం గోడమీద పిల్లులై సాయంత్రం వూసర వెల్లులై
పార్టీల రంగులు ఫిరాయించే అవకాశవాదులు
పార్టీల రంగులు ఫిరాయించే అవకాశవాదులు
అటు రాబందులు ఇటు అవకాశవాదులు
ఎక్కడి కెళుతూంది దేశం ఎమైపోతుంది
ఎక్కడి కెళుతూంది దేశం ఎమైపోతుంది
చరణం::2
ఉగ్గుపాలతో మత మౌఢ్యాలను రంగరించి
కంచాలలో వర్ణభేదాలు వడ్డించీ
ఉగ్గుపాలతో మత మౌఢ్యాలను రంగరించి
కంచాలలో వర్ణభేదాలు వడ్డించీ
జాతికి నల్ల మందెక్కించే మతో న్మాదులు
ఒక వంక మరో వంక
శాంతీ సహనం సౌహార్థం చచ్చురకం సంస్కారమని
శాంతీ సహనం సౌహార్థం చచ్చురకం సంస్కారమని
వ్యక్తుల హత్యలతోనె నేటి వ్యవస్థ మారి తీరుతుందనీ
అరాచకంగా పరిక్రమించే మహోగ్రవాదులు
ఒక వంక మతో న్మాదులు ఒక వంక
ఎక్కడి కెళుతూంది దేశం ఎమైపోతుంది
ఎక్కడి కెళుతూంది దేశం ఎమైపోతుంది
చరణం::3
ధ్యానంలోనే కాదు సౌజన్యంలోనూ కల్తీలు
నేతిలోనే కాదు నీతిలోనూ కల్తీలు
మైమరిపించె మద్యంలో మనుషుల చంపే కల్తీలు
ఫ్రాణం పోసే మందుల్లో ప్రాణం తీసే కల్తీలు
పరీక్ష రాసే చేతుల్లో కాపీ కల్తీలు
ఉప్పెనలాంటి యువతరంలో హిప్పీ కల్తీలు
అటు దినుసుల కల్తీలు ఇటు మనసుల కల్తీలు
ఎక్కడి కెళుతూంది దేశం ఎమైపోతుంది
ఎక్కడి కెళుతూంది దేశం ఎమైపోతుంది
చరణం::4
ధరల బరువుతో ప్రజల రెక్కలు విరుగుతూంటే
తిండికరువుతో పేదలు డొక్కలు మండుతూంటే
ధరల బరువుతో ప్రజల రెక్కలు విరుగుతూంటే
తిండికరువుతో పేదలు డొక్కలు మండుతూంటే
పదవులకై కుమ్ములాటలు బిరుదులకై పెనుగులాటలు
భాషా దురహంకారాలు ప్రాంతీయ హుంకారాలు
దొంగసరకు రవాణాలు నల్లడబ్బు విలాసాలు
విలువలేని నినాదాలు పనికిరాని పట్టాలు
అడుగడుగున లంచాలు పడగెత్తిన వంచనలు
రాహువు పట్టిందా జాతికి రక్తం చచ్చిందా
రాహువు పట్టిందా జాతికి రక్తం చచ్చిందా
ఇప్పటికైనా ఈదేశం తన తప్పు తెలుసుకోవాలి
రానున్న ముప్పు తెలుసుకోవాలి
కాకుంటే ఈ దేశాన్నే కణకణ మండే నిప్పులతో
కల్తీలేని నిప్పులతో కడిగేస్తుంది మాతరం
వందే మాతరం వందే మాతరం
వందే మాతరం అది నాడు మరి నేడు
యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుర్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహం
No comments:
Post a Comment