సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::N.T. రామారావు,లక్ష్మి,అల్లు రామలింగయ్య,ప్రభాకరరెడ్డి,పండరీబాయి,రాజబాబు,రమాప్రభ.
పల్లవి::
నిండు కుండ..తొణకనే తొణకదూ
అది తొణికినా..తడపకుండ నిలవదూ
నిండు కుండ..తొణకనే తొణకదూ
అది తొణికినా..తడపకుండ నిలవదూ
ఒళ్ళు తడవక...ముందే
పొద్దు గడవక...ముందే
మేలుకో..ఓ..మేలుకో..వేణుగోపాలా
గోపాలా నన్నేలుకో..ఇంక తాళజాల
మేలుకో..ఓ..వేణుగోపాలా గోపాలా
నన్నేలుకో..ఇంక..తాళజాల
నన్నేలుకో..ఇంక..తాళజాల
చరణం::1
చీరలెత్తుకొని పోయే చిలిపితనం నీకొద్దు
కానీ చీరగాలికే బెదిరి చెదిరితే ఏం ముద్దు..అవ్వ
చీరలెత్తుకొని పోయే చిలిపితనం నీకొద్దు
కానీ చీరగాలికే బెదిరి చెదిరితే ఏం ముద్దు
వెన్నెలలో వేల కన్నెలతో విహరించుట తగనిపని
ఉన్న ఒక్కదాన్ని నమ్ముకున్న దాన్ని వొదులుకుంటా వెందుకని
పెట్టిన పేరును నిలబెట్టుకోవేలా చేపట్టిన వారి కొంగు పట్టుకోవేలా
మేలుకో..వేణుగోపాలా...గోపాలా
నన్నేలుకో ఇంక...తాళజాల
నన్నేలుకో ఇంక...తాళజాల
చరణం::2
వాడవాడలో తిరిగే కోడెతనం కోరలేదు
కానీ వలచిన చెలి మనసు తెలిసి చెలరేగాలంటాను
మ్మ్..వాడవాడలో తిరిగే కోడెతనం కోరలేదు
కానీ వలచిన చెలి మనసు తెలిసి చెలరేగాలంటాను
వెన్నముద్దల దొంగతనం..మ్మ్..విడిచిపెట్టమనలేదు
ఈ కన్నె ముద్దులు కాజేసీ..ఈ..కనికరించమంటాను
పనికిరాని బిగువుమాని పదును చూపవేమి
ఒలిచి చూపినా ఇంక తెలియదాయె స్వామీ..అయ్యో స్వామీ
మేలుకో..వేణుగోపాలా...గోపాలా
నన్నేలుకో ఇంక...తాళజాల
నన్నేలుకో ఇంక...తాళజాల..మేలుకో
No comments:
Post a Comment