Tuesday, May 21, 2013

ప్రేమ లేఖలు--1977




















సంగీతం::సత్యం
రచన::శ్రీ శ్రీ 
గానం::P.సుశీల, వాణీ జయరాం 
దర్శకులు శ్రీ K.రాఘవేంద్ర రావు గారు
తారాగణం::మరళీమోహన్,అనంతనాగ్,సత్యనారాయణ,జగ్గయ్య,జయసుధ,దీప,
అల్లు రామలింగయ్య

పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఈ రోజు మంచి రోజు
మరపు రానిది మధురమైనది
మంచితనం ఉదయించిన రోజు

ఆ..ఆ..ఆ..ఆ
ఈ రోజు మంచి రోజు
మరపు రానిది మధురమైనది
ప్రేమ సుమం వికసించిన రోజు

చరణం::1

తొలిసారి ధ్రువతార దీపించెను 
ఆ కిరణాలే లోకాన వ్యాపించెను 

ఆ..ఆ..
తొలి ప్రేమ హృదయాన పులకించేను
అది ఆనంద దీపాలు వెలిగించెను 

చెలి కాంతులలో..సుఖ శాంతులతో 
జీవితమే పావన మీనాడు 

ఈ రోజు మంచి రోజు
మరపు రానిది మధురమైనది
ప్రేమ సుమం వికసించిన రోజు

చరణం::2

రెండు నదుల సంగమమే అతి పవిత్రము
మతములన్ని ఒకటైతే మానవత్వము
మనసు మనసు ఒకరికొకరు తెలిపే రోజు
తీరని కోరికలన్నీ తీరే రోజు
అనురాగాలు..అభినందనలు
అందించే శుభ సమయం నేడు 

ఈ రోజు మంచి రోజు
మరపు రానిది మధురమైనది
మంచితనం ఉదయించిన రోజు
ప్రేమ సుమం వికసించిన రోజు

No comments: