సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం:: చలం,జయంతి,సత్యనారాయణ,భారతి,శుభ,K.విజయ,చలపతిరావు
పల్లవి::
ఏమిటమ్మా..అంతకోపం ఎవరిమీద
ఎందుకోసం..ఆహా..ఆహా..ఆహా
ఏమిటమ్మా..అంతకోపం ఎవరిమీద
ఎందుకోసం..ఆహా..ఆహా..ఆహా
చరణం::1
నా వెంటపడ్డావు ఇదియేం ధర్మం
నా వెంటపడ్డావు ఇదియేం ధర్మం
నన్నొదిలిపెడితే నీకో దణ్ణం..ఊ హు
మీ అమ్మకూ అయ్యకూ మీ తాతకూ
ముత్తాతకూ దణ్ణం దణ్ణం సాష్టాంగ దండం
ఏమిటమ్మా..అంతకోపం ఎవరిమీద
ఎందుకోసం ఆహా..ఆహా..ఆహా
చరణం::2
ఎవరో ఏదో అన్నారని ఏమేమో..ఆడిపోసుకున్నారని
ఎవరో ఏదో అన్నారని ఏమేమో..ఆడిపోసుకున్నారని
చిర్రుబుర్రులాడితే ఎలాగండీ..చిర్రుబుర్రులాడితే ఎలాగండీ
గుర్రాన్ని కాస్తంత కట్టేయండి..ఏమండీ..ఏమండీ
పేదవాని కోపం పెదవికే చేటు..ఆడదాని కోపం అన్నింటికీ చేటు
పేదవాని కోపం పెదవికే చేటు..ఆడదాని కోపం అన్నింటికీ చేటు
నన్నొదిలిపెడితే..నీకో దణ్ణం
మీ అమ్మకూ అయ్యకూ మీ తాతకూ
ముత్తాతకూ దణ్ణం దణ్ణం సాష్టాంగ దండం
ఏమిటమ్మా..అంతకోపం ఎవరిమీద
ఎందుకోసం ఆహా..ఆహా..ఆహా
చరణం::3
మూడు ఏడు రెండు మూడు ఆరూ రాజుగారికి
జాక్ పాట్ ష్యూర్..రాజుగారికి జాక్ పాట్ ష్యూర్
ఆడుకో నువ్వే ఆ నంబర్లు వస్తే అనుభవించు
నువ్వే ఆ లక్షలూ లక్షలు
ఏమిటమ్మా అంతకోపం ఎవరిమీద
ఎందుకోసం ఆహా..ఆహా..ఆహా
చరణం::4
ఆడదాని ఉసురు మగవానికి శాపం
అచ్చురాదు నీకిది అమ్మతోడు నిజం నిజం
ఆడదాని ఉసురు మగవానికి శాపం
అచ్చిరాదు నీకిది అమ్మతోడు నిజం నిజం
పిల్లి శాపాలకు ఉట్లు తెగవులే
పిల్ల కోపాలకు పుట్టి మునగదే
పిల్లి శాపాలకు ఉట్లు తెగవులే
పిల్ల కోపాలకు పుట్టి మునగదే
ఆహా..ఆహా..ఆహా..ఏమిటమ్మా అంతకోపం
ఎవరిమీద..ఎందుకోసం..ఆహా..ఆహా..ఆహా..లలల..ఆహాహా
No comments:
Post a Comment