సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::P.సుశీల
పల్లవి:
వదలనురా నిను రఘురామా
వదలనురా నిను రఘురామా
నా జీవితమే..నవపారిజాతము
నా జీవితమే..నవపారిజాతము
ఏనాడో..ఓ..నీకే..ఏ..ఏ..ఏఏ..ఏఏ..ఏఏ
అంకితమూ..
వదలనురా నిను రఘురామా
చరణం::1
నా భావములో..జీవము నీవే
నా గానములో..మాధురి నీవే
నా భావములో..జీవము నీవే
నా గానములో..మాధురి నీవే
తోడు నీడా..ఆ..ఆ..మనుగడ నీవే
తోడు నీడా..ఆ..ఆ..మనుగడ నీవే
నను నడిపించే దైవము నీవే
వదలను..వదలను..వదలనురా నిను రఘురామా
చరణం::2
కోరను ఎపుడూ..సిరిసంపదలు
అడగను నిన్నూ..వేరే వరములు
కోరను ఎపుడూ..సిరిసంపదలు
అడగను నిన్నూ..వేరే వరములు
పావనమౌ నీ పదములే చాలు
పావనమౌ నీ పదములే చాలు
నను పాలించే సౌభాగ్యాలు
వదలను..వదలను..
వదలను రా నిను రఘురామా
నా జీవితమే నవపారిజాతము
ఏనాడో అది నీకే..ఏ..ఏ..ఏ..ఏ
అంకితము..
No comments:
Post a Comment