సంగీతం::సత్యం
రచన::మైలవరపు గోపి
గానం:K.J.ఏసుదాస్,P.సుశీల
పల్లవి::
మోమున బొట్టెట్టి..నీ బుగ్గన చుక్కెట్టి
బొమ్మల నడుమ ముద్దుల గుమ్మా..కుదిరింది శుభలగ్నము
నేడే కళ్యాణ వైభోగమూ..
మోమున బొట్టెట్టి..నీ బుగ్గన చుక్కెట్టి
ఈ బొమ్మకి నచ్చిన మన్మధుడమ్మ
కుదిరింది శుభలగ్నము..నేడే కళ్యాణ వైభోగమూ
పాపపపపమ గమదనిప ఆ ఆ ఆ..
సాససస సనిసమగమస ఆ ఆ ఆ..
పనిసనిపా..ఆ..గపమగస..ఆ..పమగమప సా పా
చరణం::1
తానం తననం..తననననం..తానం తననం..తననననం
తననన..తననన..తననన..తననన..తననననం..తననననం..తననం
మమతలు కూర్చి మాలికలల్లిన సమయం..సమయం
ఆ కూర్చిన మాలలు మనసులు కలిపిన తరుణం..తరుణం
మమతలు కూర్చి మాలికలల్లిన సమయం..సమయం
ఆ కూర్చిన మాలలు మనసులు కలిపిన తరుణం..తరుణం
ఆ గగనం పందిరట..ఈ భువనం వేదికట
బొమ్మల నడుమ ముద్దుల గుమ్మా
కుదిరింది శుభలగ్నము..నేడే కళ్యాణ వైభోగమూ
మోమున బొట్టెట్టి..నీ బుగ్గన చుక్కెట్టి
ఈ బొమ్మకి నచ్చిన మన్మధుడమ్మ
కుదిరింది శుభలగ్నము..నేడే కళ్యాణ వైభోగమూ
చరణం::2
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
నినిపప పమప నినిపప పమప ససని ససని పమ గమపనిపా
గమపని సనిసగ మదపగ మపగమ రిగమపా మగమ రిపమగ రిగసా
తానం..తననం..తననననం..తానం తననం..తననననం
తననన..తననన..తననన..తననన..తననననం..తననననం..తననం
మన కలయికలో కొత్తగ తోచెను ఉదయం..ఉదయం
పురి విప్పిన నెమలిగ నాట్యం చేసెను హృదయం..హృదయం
మన కలయికలో కొత్తగ తోచెను ఉదయం..ఉదయం
పురి విప్పిన నెమలిగ నాట్యం చేసెను హృదయం..హృదయం
నీ కట్నం అనురాగం..నీ కానుక ఆనందం
ఈ బొమ్మకి నచ్చిన మన్మధుడమ్మ..కుదిరింది శుభలగ్నము
నేడే కళ్యాణ వైభోగమూ..
మోమున బొట్టెట్టి..నీ బుగ్గన చుక్కెట్టి
బొమ్మల నడుమ ముద్దుల గుమ్మా
కుదిరింది శుభలగ్నము..నేడే కళ్యాణ వైభోగమూ
No comments:
Post a Comment