సంగీతం::సాలూరి రాజేశ్వరరావు
రచన::కోసరాజు రాఘవయ్య
గానం::బి వసంత,పిఠాపురం నాగేశ్వరరావు
తారాగణం::అక్కినేని,శారద,కాంచన,నాగభూషణం,గుమ్మడి,చంద్రమోహన్,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు.
పల్లవి::
చిలకలాంటి చిన్నదానా..రావే వయ్యారి జాణ
తప్పతాగి తన్నావులే..సిగ్గులేక చేరావులే
చాకులాంటి కుర్రవాడా..చాల్లే సరసాలుపోరా
చరణం::1
నీవక్కడా నేనిక్కడా..నా మోజు తీరేది యింకెక్కడా
అయ్యగారి సీసాలో..అడుగుబొడుగు చుక్కేసి
అయ్యగారి సీసాలో..అడుగుబొడుగు చుక్కేసి
తిక్కకాస్త రేగ్గానే..తైతక్కలాడేవు
ఈ తప్పు కాయమంటా..నే చెంపలేసుకుంటా
నువు చెప్పినట్టు వింటా..ఓ పిల్లా రసగుల్లా
చాకులాంటి కుర్రవాడా చాల్లే సరసాలుపోరా
చరణం::2
పెళ్ళిగాకముందేమొ ప్రేమ ఒలకబోశావు
మోజు తీరిపోయినాక..ప్లేటు ఫిరాయించావు
మందులోని మహిమగాని..మనిషిలోన మార్పులేదు
అమ్మతోడు ఒట్టేసి..అసలు మాట చెప్పేశా
నీ మాటలన్నీ ఝూటా..అరె నీటిలోన మూట
నీ కిప్పుడిదేపాట..యీతంట వద్దంటా
చిలకలాంటి చిన్నదానా..రావే వయ్యారి జాణ
చరణం::3
ఇంటింటా యింతేలే..అలూమగలతగువు మామూలే
ఇంటింటా యింతేలే..అలూమగలతగువు మామూలే
తగువులాడుకుంటేనే..తమాషాగ వుంటాది
తగువులాడుకుంటేనే..తమాషాగ వుంటాది
రోజు రోజుకు మోజు..రేకెత్తుతుంటాది
చిలకలాంటి చిన్నదానా..రావే వయ్యారి జాణ
చాకులాంటి కుర్రవాడా..చాల్లే సరసాలుపోరా
No comments:
Post a Comment