సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు,మంజుల,లత,మురళీమోహన్, గుమ్మడి
పల్లవి::
చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా
చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా
ఎపుడమ్మా...ఎపుడమ్మా
చరణం::1
నేడుగాకున్న రేపైనా వసంతం రానే వస్తుంది
ఆహా ఓహో...అహా ఓహో
మోడుగావున్న జీవితమే పూలతో ముస్తాబవుతుంది
ఆహా ఓహో...అహా ఓహో
నేడుగాకున్న రేపైనా వసంతం రానే వస్తుంది
మోడుగావున్న జీవితమే పూలతో ముస్తాబవుతుంది
గాలిలా సాగిపోతేనే గమ్యము ఎదురౌతుందమ్మా
ఏరులా పొంగిపోతేనే సాగరం చేరువౌనమ్మా
అయ్యో రామా..చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా..ఎపుడమ్మా
చరణం::2
అహా ఓహో
మెత్తగా ఉంటే ఈ లోకం నెత్తిపై కాళ్ళు పెడుతుంది
ఆహా ఓహో...అహా ఓహో
ఆ కత్తిలా వున్నవాడంటే గులామై కాళ్ళుపడుతుంది
ఆహా ఓహో...ఆహా ఓహో
మెత్తగా వుంటే ఈ లోకం నెత్తిపై కాళ్ళు పెడుతుంది
కత్తిలా వున్నవాడంటే గులామై కాళ్ళుపడుతుంది
విత్తనం నేలలో ఉంటే దానికి విలువే లేదమ్మా
మొక్కలా చీల్చుకొస్తేనే దానికీ ఫలితం ఉందమ్మా
అయ్యో రామా..చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా..ఎపుడమ్మా
చరణం::3
పచ్చని తీగ పందిరికై వింతగా పరుగులు తీస్తుంది
ఆహా ఓహో...ఆహా ఓహో
వెచ్చని పరువం జతకోసం అంతగా ముచ్చట పడుతుంది
ఆహా ఓహో...ఆహా ఓహో
పచ్చని తీగ పందిరికై వింతగా పరుగులు తీస్తుంది
వెచ్చని పరువం జతకోసం అంతగా ముచ్చట పడుతుంది
కుమిలిపోతున్న గుండెల్లో తేనెలు కురిపించాలమ్మా
చీకటి కమ్మిన కళ్ళల్లో వెన్నెల చిలికించాలమ్మా
అయ్యో రామా..చెకుముకి రవ్వ చినబోయింది ఓయమ్మా
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా
అది గుప్పున మండీ నిప్పైరగిలే దెపుడమ్మా..ఎపుడమ్మా
No comments:
Post a Comment