Friday, May 06, 2011

కుంకుమ తిలకం--1983

కుంకుమ తిలకం
సంగీతం::సత్యం
గానం::K.జేసుదాస్

ఆలనగా పాలనగా
అలసిన వేళల అమ్మవుగా
లాలించు ఇల్లాలిగా...దేవీ...పాలించు నా రాణిగా

ఆలనగా పాలనగా
అలసిన వేళల అమ్మవుగా
లాలించు ఇల్లాలిగా...దేవీ...పాలించు నా రాణిగా

నీ చిరునవ్వే తోడై ఉంటే...నే గెలిచేను లోకాలన్ని
నీ చిరునవ్వే తోడై ఉంటే...నే గెలిచేను లోకాలన్ని
అరఘడియయినా నీ ఎడబాటూ
వెన్నెలకూడ చీకటి నాకు
లాలించు ఇల్లాలిగా...దేవీ...పాలించు నా రాణిగా

మోమున మెరిసే కుంకుమ తిలకం
నింగిని వెలిగే జాబిలి కిరణం
మోమున మెరిసే కుంకుమ తిలకం
నింగిని వెలిగే జాబిలి కిరణం

నేనంటే...నీ మంగళసూత్రం
నువ్వంటే...నా ఆరోప్రాణం
లాలించు ఇల్లాలిగా...దేవీ...పాలించు నా రాణిగా

ఆలనగా పాలనగా
అలసిన వేళల అమ్మవుగా

No comments: