http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4783
సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు
తారాగణం::రామకృష్ణ,రంగనాద్,శ్రీధర్,చంద్రమోహన్,వాణిశ్రీ, S.వరలక్ష్మి
పల్లవి::
హే...య్యా..హోయ్..హోయ్
దొరలెవరో దొంగలెవరో..తెలుసుకుంటానూ
తెలియకపోతే ప్రాణాలొడ్డి..తేల్చుకుంటానూ
ఏ..హేహేహేహే..దొరలెవరో దొంగలెవరో తెలుసుకుంటానూ
తెలియకపోతే ప్రాణాలొడ్డి తేల్చుకుంటానూ..య్య
చరణం::1
హ్హ హ్హుహ్హు..హ్హ హ్హుహ్హు
హ్హ..మనిషి పులిని చంపాడంటే..శౌర్యమంటారూ
పులి మనిషిని చంపిందంటే..క్రౌర్యమంటారూ
ఆ..హహహ..మనిషి పులిని చంపాడంటే శౌర్యమంటారూ
పులి మనిషిని చంపిందంటే..ఏ..క్రౌర్యమంటారూ
ఏమి ధర్మమిది ఏమి న్యాయమిది ..ఎక్కడిదీ సిద్దాంతం
హేయ్..దొరలెవరో దొంగలెవరో తెలుసుకుంటానూ
తెలియకపోతే ప్రాణాలొడ్డి..తేల్చుకుంటానూ
చరణం::2
ఆ ఆ ఆ హా హా హా..ఆ హా హా హా ఆ
హ్హ హ్హుహ్హు..హ్హ హ్హుహ్హు
నిప్పులేనిదే పొగరాగదు..ఇది తిరుగులేని నిజమూ
ఎప్పటికైనా నిజం దాగదిది..మరువరాని నిజమూ
ఉప్పు మెక్కితే దాహం తథ్యం..తప్పు చేసితే దండన తథ్యం
దొరలెవరో దొంగలెవరో..తెలుసుకుంటానూ
తెలియకపోతే ప్రాణాలొడ్డి..తేల్చుకుంటానూ
హేయ్..తేల్చుకుంటానూ హేయ్..తేల్చుకుంటానూ
No comments:
Post a Comment