Tuesday, April 10, 2012

చెల్లెలి కాపురం--1971


సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::దాశరధి 
గానం::Pసుశీల,B.వసంత 

పల్లవి::

రాణీ..రమణీ..మల్లీ..వల్లీ
రాజీ..రోజా..సరోజా 
ష్..నా చిట్టి..నా చిన్నీ
నా చిట్టి..నా చిన్నీ
ఆనక అన్నీ చెబుతాలే లిల్లీ లిల్లీ
అల్లరి పెట్టకు అందరిలో తల్లీ తల్లీ
ఆనక అన్నీ చెబుతాలే లిల్లీ లిల్లీ
అల్లరి పెట్టకు అందరిలో తల్లీ తల్లీ
నా చిట్టీ..నా చిన్నీ
నా చిట్టీ..నా చిన్నీ

చరణం::1

ఎన్నడు లేనీ ఈ పులకింతా
ఎందుకోసమే నీ వళ్ళంతా 
ఎన్నడు లేనీ ఈ పులకింతా
ఎందుకోసమే నీ వళ్ళంతా 
ఎందుకే ఎందుకే ఎందుకే 
మల్లెల గాలీ చల్లగ వీచి
ఝల్లని పించెను ఒళ్ళంతా  
మల్లెల గాలీ చల్లగ వీచి
ఝల్లని పించెను ఒళ్ళంతా  
అందుకే అందుకే అందుకే..ఆ..ఉం  
బేబీ..రూబీ..సీతా..గీతా
షీలా..మాలా..సుశీలా  
ష్..నా చిట్టీ..నా చిన్నీ
నా చిట్టీ..నా చిన్నీ

చరణం::2

నీ బుగ్గలలోనా సిగ్గుల రోజా
మొగ్గలు తొడిగే ఏ ఎందుకనీ
నీ బుగ్గలలోనా సిగ్గుల రోజా
మొగ్గలు తొడిగే ఏ ఎందుకనీ
ఎందుకే ఎందుకే ఎందుకే 
చెలి చేతులలో చిక్కిన వేళా
సిగ్గే మొగ్గై విరిసెనులే
చెలి చేతులలో చిక్కిన వేళా
సిగ్గే మొగ్గై విరిసెనులే
అందుకే అందుకే అందుకే
అంతేనా...హా
రాజు..రామూ..వేణూ..శీనూ
సోమూ..గోపీ..బాలయ్యా 
ష్..నా చిట్టీ..నా చిన్నీ
నా చిట్టీ..నా చిన్నీ

No comments: