Wednesday, April 11, 2012

తూర్పు వెళ్ళె రైలు--1979




సంగీతం::S.P.బాలసుబ్రమణ్యం
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల

కన్నె మా చిన్నారి కాఫాడవమ్మ
నిండుగా మన ఊరు నిలబెట్టవమ్మ
కన్నె మా చిన్నారి కాఫాడవమ్మ
నిండుగా మన ఊరు నిలబెట్టవమ్మ

నీవు ఊరేగితే నిలుచు వానల్లు
నీవు దయ చూపితే నిలుచు ఇల్లిల్లు
కన్నె మా చిన్నారి కాఫాడవమ్మ
నిండుగా మన ఊరు నిలబెట్టవమ్మ

తలమీద అంటేము సంపంగి నూనె
ఒంటిపై పూసేము చిరుబంతి పసుపు
ఇంటికొక కడవగా గంగ పోసేము
ఇంటికొక కడవగా గంగ పోసేము.
కంటి కొక వెలుగుగా హరతిచ్చేము
కన్నె మా చిన్నారి కాఫాడవమమ
నిండుగా మన ఊరు నిలబెట్టవమమ

వాన వెలిసింది వరద తీసింది
అయినను మా మొక్కు మానలేమమ్మ
కాగడ చేపట్టి కడగంటి నవ్వుతో
కాగడ చేపట్టి కడగంటి నవ్వుతో
కన్నె దిశములతో కదలి పోవమ్మా...కదలి పోవమ్మా

No comments: