Saturday, April 07, 2012

యుగపురుషుడు--1978




















సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::వేటూరి 
గానం::P.సుశీల, S.P. బాలు
తారాగణం::N.T. రామారావు,జయప్రద,రావు గోపాలరావు,రాజబాబు,
అల్లు రామలింగయ్య,జయలక్ష్మి

ఆమె::-ఒక్క రాత్రి వచ్చిపోరా 
వేయి రాత్రుల వెన్నెలిస్తా
ఒక్క మాట చెప్పి పోరా
ఏడు జన్మలు వేచి ఉంటా 

అతడు::-ఒక్క రాత్రి వచ్చిపోవే
వేయి పాన్పుల హాయినిస్తా 
ఒక్క మాట ఇచ్చిపోవే
ఎన్ని జన్మలైనా కలిసిఉంటా

చరణం::1 

అతడు::-మెత్త మెత్తగా..యెదనె మత్తుగా
హత్తుకుపోతా..హాయి అంచు చూస్తా 
మెత్త మెత్తగా..యెదనె మత్తుగా
హత్తుకుపోతా..హాయి అంచు చూస్తా 

ఆమె::-కన్నె మోజులే..నిన్నల్లుకోనీ..ఈ 
కన్నె మోజులే..నిన్నల్లుకోనీ..ఈ 
కౌగిలింతలే నా ఇల్లు కానీ
ఒక్క రాత్రి వచ్చిపోరా 
వేయి రాత్రుల వెన్నెలిస్తా

చరణం::2 

ఆమె::-ఆవిరావిరవుతున్నది నా అందమూ
ఆవురావంటున్నది నీ కోసమూ

ఆవిరావిరవుతున్నది నా అందమూ
ఆవురావంటున్నదె నీ కోసమూ

అతడు::-నీ సోగసే ఆవిరైతే
నా వయసుకు ఊపిరి
నీ సోగసే ఆవిరైతే
నా వయసుకు ఊపిరి

పెదవెంగిలితో తీరును 
ప్రేమ అనే ఆకలి

అతడు::-ఒక్కరాత్రి వచ్చిపోవే 
ఆమె::-ఒక్క రాత్రి వచ్చి పోరా 
వేయి రాత్రుల వెన్నెలిస్తా

అతడు::-ఒక్క మాట ఇచ్చిపోవే 
ఎన్ని జన్మలైనా కలిసి ఉంటా

No comments: