సంగీతం::ఇళయరాజా
రచన::దేవులపల్లి
గానం::S.జానకి
పల్లవి::
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
చరణం::1
జయ జయ సశ్యామల సుశ్యామ చలచ్చేలాంచల
జయ జయ సశ్యామల సుశ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
చరణం::2
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పత విహరణ
జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణ
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
No comments:
Post a Comment