Tuesday, March 08, 2011

ఆత్మగౌరవం--1966






















సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని,కాంచన,గుమ్మడి, రాజశ్రీ,రేలంగి,సూర్యకాంతం, చలం

పల్లవి::

ఆ ఆ ఆ ఆహ్హా..
ప్రేమించనిదే పెళ్ళాడనని..తెగకోతలు కోశావులే
ఆ మాటలు ఏమైనవి?..అహా..అయ్యగారు ఓడారులే

ఉహు..ఉహు..ఉహు..ఉహు
పెళ్ళాడనిదే ప్రేమించనని..తెగ లెక్చరు దంచావులే
ఆ మాటకు..నీ చేతకు..అహ అంతు పొంతు లేదాయలే

చరణం::1

నీ వలపు తెలుపక ఊ అంటివి..నా తలపు తెలియక ఔనంటివి
నీ వలపు తెలుపక ఊ అంటివి..నా తలపు తెలియక ఔనంటివి
నీ ఆశయం ఏమైనది?..అహ..నీటిమూట అయిపోయెలే
ప్రేమించనిదే పెళ్ళాడనని తెగకోతలు కోశావులే..

చరణం::2

శ్రీరంగనీతులు చెప్పావులే..చిత్రంగ ప్లేటును తిప్పావులే
శ్రీరంగనీతులు చెప్పావులే..చిత్రంగ ప్లేటును తిప్పావులే
అమ్మాయిలు ఎటు బొంకినా..ఆహా..అందమెంతొ చిందేనులే
పెళ్ళాడనిదే ప్రేమించనని..తెగ లెక్చరు దంచావులే..

చరణం::3

ఈ సొగసు నవ్వి కవ్వింతులే..నా వయసు నిన్నే బాధించులే
కనుపాపలో నిను దాచితే నను వీడి పోలేవులే
అహ..నను వీడి పోలేవులే

ప్రేమించనిదే పెళ్ళాడనని..తెగకోతలు కోశావులే
(ఆ మాటకు..నీ చేతకు..అహ అంతు పొంతు లేదాయలే)

చరణం::4

పైపైన మెరుగులు కొన్నాళ్లవే మదిలోన మమతలు పూయాలిలే
వయ్యారమే ఒలికించినా..అయ్యగారు చలియించరు
ఆహా..అయ్యగారు చలియించరు 

ప్రేమించనిదే పెళ్ళాడనని తెగకోతలు కోశావులే
నీ మాటకు..నీ చేతకు..అహ..అంతు పొంతు లేదాయలే

No comments: