Sunday, March 24, 2013

మౌనగీతం--1981


సంగీతం::ఇళయరాజా
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు, S.జానకి
తారాగణం::మోహన్,సుహాసిని,ప్రతాప్‌పోతన్ 

పల్లవి::

చెలిమిలో వలపు రాగం
వలుపులో మధుర భావం 
రాగం భావం కలిసే ప్రణయగీతం 
పాడుకో..ర ప ప పా
పాడుకో..ర ప ప పా..పాడుకో 
చెలిమిలో వలపు రాగం
వలుపులో మధుర భావం 

చరణం::1

ఉయ్యాలలూగినాను..నీ ఊహలో
నెయ్యాలు నేర్చినాను..నీ చూపులో
ఆరాధనై గుండెలో..ఆలాపనై గొంతులో
అలల లాగా..కలల లాగా 
అలల లాగా..కలల లాగా..కదలీ రాదా
చెలిమిలో వలపు రాగం
వలుపులో మధుర భావం 

చరణం::2

నులి వెచ్చనైనా తాపం..నీ స్నేహమూ
ఎద గుచ్చుతున్న భావం..నీ రూపమూ
తుది లేని ఆనందము..తొణుకాడు సౌందర్యము
శృతిని చేర్చి..స్వరము కూర్చి
శృతిని చేర్చి..స్వరము కూర్చి..పదము కాగా
చెలిమిలో వలపు రాగం
వలుపులో మధుర భావం 
రాగం భావం కలిసే ప్రణయగీతం 
పాడుకో ర ప ప పా పాడుకో 
ర ప ప పా...పాడుకో

No comments: