సంగీతం::అశ్వత్థామ
రచన::మల్లాది రామకృష్ణశాస్ర్తి
గానం::ఘంటసాల,ఎస్.జానకి
తారాగణం::అక్కినేని, కృష్ణకుమారి , జి.వరలక్ష్మి, మీనూ ముంతాజ్
పల్లవి::
గాలిలో..గాలిలో..
తేలే పూలడోలలో..డోలలో
పన్నీరు జల్లే వెన్నెల తీవ
కన్నుల కలకల ఏమో
చిననాటి ఆనందసీమలో
అలనాటి ఆనందసీమలో
అదే చెలిమిగ విహరించేయమని
అనుకున్న కన్నె కలలే
చిననాటి ఆనందసీమలో
చరణం::1
గాలిలో..గాలిలో..
అలారుగ..అలారుగ
గాలిలో అలలు అలలుగ అలారుగ
గానమేలే కనకవీణ
నగుమోమున తళతళ ఏమో
చిననాటి ఆనందసీమలో
చరణం::2
అలనాటి కలల వేడుకలే
మనసైన వాని చేరువచేయ
మోదములో ఆదమరచే పరవశమే
చిననాటి ఆనందసీమలో
చరణం::3
గగనాన వెలిగే రేరాజు
చెంగల్వకు కలకాలము చేరువె
ఆ పలుకే నిజమై ఆ మనసే తనదై
కన్నెవలపు మాయని
పున్నమి వెలుగాయే
చిననాటి ఆనందసీమలో
No comments:
Post a Comment