Friday, March 22, 2013

అత్తా ఒకింటి కోడలే--1958




సంగీతం::పెండ్యాల 
రచన::ఆరుద్ర
గానం::పిఠాపురం స్వర్ణ లత 
తారాగణం::జగ్గయ్య, రమణమూర్తి, రమణారెడ్డి, దేవిక, హేమలత,గిరిజ, సీత

పల్లవి::

మాయదారి కీచులాట మా మధ్య వచ్చింది
రాయబారం చెయ్యవే తడికో తడిక
నువు రాయబారం చెయ్యవే తడికో తడిక

ఆడి వొగలమారి మాటలకు వొళ్ళంతా మండుతుందీ
రాయబారమెందుకే తడికో తడిక
నీ రాయబారమెందుకే తడికో తడిక

నేను ముక్కు పుడక తెచ్చాను ముంత గూట్లో పెట్టాను
పెట్కొమని దాన్ని పెట్కొమని బేగి పెట్కొమని
చెప్పవే తడికో తడిక

ఓ..ఆడి ముక్కు పుడక ముక్కలవ్వ చూడబోతె రాళ్ళు లేవు
తిప్పబోతె చిన్నమెత్తు శీల లేదు
ఆడి పోసుకోలు మాటలకుమోసపోను నేనింక
పొమ్మని చెప్పవే తడికో తడిక

మాయదారి కీచులాట మా మధ్య వచ్చింది
రాయబారం చెయ్యవే తడికో తడిక
నువు రాయబారం చెయ్యవే తడికో తడిక

నేను పట్టు చీర తెచ్చాను పెట్టెలోన పెట్టాను
కట్కొమని దాన్ని కట్కొమని బేగి కట్కొమని
చెప్పవే తడికో తడిక
అ తడికొ అ తడికొ అ తడిక తడిక తడికో

ఓ ఆడి పట్టు చీరకంచు లేదు కట్టబోతె చెంగు లేదు
తెచ్చినాడి తెలివి తెల్లారిపోను
ఆడి ఇచ్చకాల మాటలకు ఇరిగింది నా మనసు
ఇడిసి పొమ్మనవే తడికో తడిక
నన్నిడిసి పొమ్మనవే తడికో తడిక
అ తడికొ అ తడికొ అ తడిక తడిక తడికో

రమణి ముద్దుల గుమ్మ తాను రాజీకి రాకుంటే
రాతిరి శివ రాతిరే తడికో తడిక
ఈ ఏటికేడు ఏకాశే తడికో తడిక
వంకాయ వండాను వరి కూడు వార్చాను
తినమని చెప్పవే తడికో తడిక
ఆణ్ణి తినమని చెప్పవే తడికో తడిక

వగలాడి చేతులతో వడ్డనా చేయకున్న
దిగదని చెప్పవే తడికో తడిక
ముద్ద దిగదని చెప్పవే తడికో తడిక
అ తడికొ అ తడికొ అ తడిక తడిక తడికో

ఆడి ఇచ్చకాల మాటలకు ఇరిగింది నా మనసు
ఇడిసి పొమ్మనవే తడికో తడిక
నన్నిడిసి పొమ్మనవే తడికో తడిక
అ తడికొ అ తడికొ అ తడిక తడిక తడికో

చిన్నారి పొమ్మంటె సన్నాసం పుచ్చుకొని
ఇంటికింక రానే తడికో తడిక
ఇది ఇవరంగ చెప్పవే తడికో తడిక

సన్నాసం ఎందుకు అన్యాలం చెయ్యకు
నిన్నిడిసి ఉండలేను మావోయి మావ
నేనిన్నిడిసి ఉండలేను మావోయి మావ
నేనిన్నిడిసి ఉండలేను మావోయి మావ
అ మావోయి మావోయి మావ

No comments: