Friday, March 18, 2011

తోట రాముడు--1975


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4535
సంగీతం::సత్యం
రచన::ఆత్రేయ  
గానం::S.P.బాలు 
తారాగణం::చలం,ప్రభాకర రెడ్డి,త్యాగరాజు,బాలకృష్ణ,మంజుల,పండరీబాయి,రమాప్రభ 

పల్లవి::

నేస్తం చూడర..ఈ కుళ్ళులోకము 
చూస్తే కోరవు..ఈ నర జన్మము
తీపిమాటలు..గొంతు కోతలు 
నరులకు..మాకే సొంతము
అరె హొయ్‌..అరె హొయ్‌ 
అరె హొయ్‌..అరె హొయ్‌  టుర్రా     
నేస్తం చూడర..ఈ కుళ్ళులోకము
చూస్తే కోరవు..ఈ నర జన్మము

చరణం::1

నోట్లను వెదజల్లి..ఓట్లను కాజేసి
పెద్దోళ్ళు అయ్యారురా మావోళ్ళు..గద్దెక్కి ఏలేరురా 
నోట్లను వెదజల్లి..ఓట్లను కాజేసి
పెద్దోళ్ళు అయ్యారురా మావోళ్ళు..గద్దెక్కి ఏలేరురా 
తలలు మార్చడం..కొంప కూల్చడం
నరులకు...మాకే సొంతము
అరె హొయ్‌..అరె హొయ్‌ 
అరె హొయ్‌..అరె హొయ్‌  టుర్రా     
నేస్తం చూడర..ఈ కుళ్ళులోకము
చూస్తే కోరవు..ఈ నర జన్మము

చరణం::1

గడ్డిని నువు మేసి పాలను...మాకిస్తే  
కడుపుబ్బ తాగేమురా మేము..గరళాన్ని కక్కేమురా
గడ్డిని నువు మేసి పాలను...మాకిస్తే   
కడుపుబ్బ తాగేమురా మేము..గరళాన్ని కక్కేమురా
కాళ్ళు పట్టడం కాటు...వేయడం
నరులకు మాకే...సొంతము
అరె హొయ్‌..అరె హొయ్‌ 
అరె హొయ్‌..అరె హొయ్‌  టుర్రా     
నేస్తం చూడర..ఈ కుళ్ళులోకము
చూస్తే కోరవు..ఈ నర జన్మము

చరణం::2

దేశం అంటాము తిండిని..దాస్తాము
కల్తీలు చేస్తామురా మేము..ప్రాణాలు తీస్తామురా
దేశం అంటాము తిండిని..దాస్తాము
కల్తీలు చేస్తామురా మేము..ప్రాణాలు తీస్తామురా
నీతి చెప్పడం..నిప్పు పెట్టడం   
నరులకు మాకే..సొంతము
అరె హొయ్‌...అరె హొయ్‌ 
అరె హొయ్‌..అరె హొయ్‌  టుర్రా     
నేస్తం చూడర..ఈ కుళ్ళు లోకము
చూస్తే కోరవు..ఈ నర జన్మము
తీపిమాటలు..గొంతు కోతలు
నరులకు మాకే..సొంతము
అరె హొయ్‌..అరె హొయ్‌ 
అరె హొయ్‌..అరె హొయ్‌  టుర్రా

No comments: