Friday, March 18, 2011

ఎదురీత--1977
























సంగీతం::సత్యం
రచన::సినారె  
గానం::P.సుశీల 

పల్లవి::

ఈ రాధ చివరకు ఏమైనా..ఆ గాధ నీదేలే 
ఈ రాధ చివరకు ఏమైనా..ఆ గాధ నీదేలే 
కలలన్నీ అలలైన యమునా నదిలో..కలతల కన్నీరే

ఈ రాధ చివరకు ఏమైనా..ఆ గాధ నీదేలే 

చరణం::1

బృందావనిలో బిగికౌగిలిలో..అల్లికలేమాయే..కలయికలేమాయే
వ్రేపల్లియలో..వేణువు ఎదలో..గీతికలేమాయే
మధురాపురిలో..నడిరాతిరిలో..మాధవుడేమాయే

ఈ రాధ చివరకు ఏమైనా..ఆ గాధ నీదేలే 

చరణం::2

మరుమల్లెలలో..విరిజల్లులలో..మల్లికలేమాయే..మధురిమలేమాయే 
ఆ కన్నులలో..వెన్నెల దాచిన పున్నమలేమాయే
చేసిన బాసలు..పూచిన ఆశలు..రాలిన పూలాయే

ఈ రాధ చివరకు ఏమైనా..ఆ గాధ నీదేలే  

No comments: