సంగీతం::J.V.రాఘవులు
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
పల్లవి::
ప్రేమిస్తే ఏమవుతుంది?..హ్మ్..హ్మ్..పెళ్ళవుతుంది
పెళ్ళైతే ఏమవుతుంది?..ఆహహ ఏమవుతుంది..ఒక ఇల్లవుతుంది
ప్రేమిస్తే పెళ్లవుతుంది..పెళ్ళైతే ఇల్లవుతుంది
ప్రేమకు ఒక ఊపొస్తుందీ..హొయ్ హొయ్ హొయ్
పెళ్ళికి ఒక రూపొస్తుంది..ఆహా..పెళ్ళికి ఒక రూపొస్తుంది
చరణం::1
మనసుంటే ప్రేమ తానె పుట్టుకొస్తుందీ
వయసొస్తే వద్దన్నా నెట్టుకొస్తుందీ
పగ్గాలు తెంచుకొని పరుగులెత్తుతుంది
పసుపు తాడు పడగానే అదుపులోకి వస్తుంది
ప్రేమిస్తే పెళ్లవుతుంది..పెళ్ళైతే ఇల్లవుతుంది
ప్రేమకు ఒక ఊపొస్తుందీ..హొయ్ హొయ్ హొయ్
పెళ్ళికి ఒక రూపొస్తుంది..ఆహా..పెళ్ళికి ఒక రూపొస్తుంది
చరణం::2
ప్రేమంటే వెన్నెల్లా చల్లనైనది
ప్రేమంటే తేనెలా తీయనైనది
ప్రేమంటే అదో రకం పిచ్చి వంటిది
పెళ్ళే ఆ పిచ్చికి మందు వంటిదీ
ప్రేమిస్తే పెళ్లవుతుంది..పెళ్ళైతే ఇల్లవుతుంది
ప్రేమకు ఒక ఊపొస్తుందీ..హొయ్ హొయ్ హొయ్
పెళ్ళికి ఒక రూపొస్తుంది..ఆహా..పెళ్ళికి ఒక రూపొస్తుంది
చరణం::3
నిన్న మొన్న దాక నిన్ను నువ్వెవ్వరు అన్నది
వలపు మొలిచినంతనే నువ్వే నేనంటుంది
నువ్వు లేక నేలేనని..పువ్వు తావి మనమని
గుండెలోన దాగుతుంది..కోరికలు రేపుతుంది
ప్రేమిస్తే పెళ్లవుతుంది..పెళ్ళైతే ఇల్లవుతుంది
ప్రేమకు ఒక ఊపొస్తుందీ..హొయ్ హొయ్ హొయ్
పెళ్ళికి ఒక రూపొస్తుంది..ఆహా..పెళ్ళికి ఒక రూపొస్తుంది
Bhale Alludu--1977
Music::J.V.Raghavulu
Lyrics::Acharya,Atreya
Singer's::S.P.Baalu,P.Suseela
:::
praemiste emavutundi?..hm..hm..peLLavutundi
peLLaite emavutundi?..aahaha..emavutundi..oka illavutundi
premiste peLlavutundi..peLLaite illavutundi
premaku oka oopostundee..hoy hoy hoy
peLLiki oka roopostundi..aahaa..peLLiki oka roopostundi
:::1
manasunTe prema taane puTTukostundee
vayasoste vaddannaa neTTukostundee
paggaalu tenchukoni parugulettutundi
pasupu taaDu paDagaane adupulOki vastundi
premiste peLlavutundi..peLLaite illavutundi
premaku oka oopostundee..hoy hoy hoy
peLLiki oka roopostundi..aahaa..peLLiki oka roopostundi
:::2
premanTe vennellaa challanainadi
premanTe tenelaa teeyanainadi
premanTe adO rakam pichchi vanTidi
peLLe aa pichchiki mandu vanTidee
premiste peLlavutundi..peLLaite illavutundi
premaku oka oopostundee..hoy hoy hoy
peLLiki oka roopostundi..aahaa..peLLiki oka roopostundi
:::3
ninna monna daaka ninnu nuvvevvaru annadi
valapu molichinantane nuvve nenanTundi
nuvvu leka nelenani..puvvu taavi manamani
gunDelOna daagutundi..kOrikalu reputundi
premiste peLlavutundi..peLLaite illavutundi
premaku oka oopostundee..hoy hoy hoy
peLLiki oka roopostundi..aahaa..peLLiki oka roopostundi
No comments:
Post a Comment