సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::దాశరథి
గానం::ఘంటసాల
తారాగణం::N.T.రామారావు,కాంతారావు,S.V.రంగారావు,జమున,జయలలిత
పల్లవి::
జయహే నవనీలమేఘశ్యామా..వన మాలికాభిరామా
జయహే నవనీలమేఘశ్యామా..వనమాలికాభిరామా
జయహే నవనీలమేఘశ్యామా..వనమాలికాభిరామా
నీ గానమ్ములో ఈ లోకమ్ములే పులకించు
దేవ దేవా..ఆఆ..పులకించు దేవ దేవా..ఆఆ
జయహే నవ నీల మేఘ శ్యామా..వన మాలికాభిరామా
చరణం::1
వేదాల కొసలందు వెలుగొందు స్వామీ..రేపల్లె వాడలో వెలసినావేమీ
మానవుని దేవునిగ మలచనే గాదా..ఆఆఆఆఆ
మానవుని దేవునిగ..మలచనేగాదా
అవులే..సరేలే..భలే లీలలే
జయహే నవ నీల మేఘ శ్యామా..వన మాలికాభిరామా
చరణం::2
ఇలలోన ధర్మమ్ము నెలకొల్పనెంచి..ఎన్నెన్నో రూపల ఏతెంతువీవు
ఇలలోన ధర్మమ్ము నెలకొల్పనెంచి..ఎన్నెన్నో రూపల ఏతెంతువీవు
వేడిన వారిని విడనాడబోవు..నిజంనిజం ముమ్మాటికిది నిజం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జయహే నవ నీల మేఘ శ్యామా..వన మాలికాభిరామా
చరణం::3
మధురం మధురం..అధరం మధురం
అధరం సోకిన..వేణువు మధురం
మధురం మధురం..అధరం మధురం
అధరం సోకిన..వేణువు మధురం
నామం మధురం..రూపం మధురం
పిలుపే మధురం..తలపే మధురం..నీవే..ఏ..మధురం
No comments:
Post a Comment