సంగీతం::T.చలపతి రావ్
రచన::?
గానం::P.సుశీల
అన్నా నీ అనురాగం
ఎన్నొ జన్మల పుణ్యఫలం
ఓ అన్నా నీ అనురాగం
పుట్టినరోజున మీ దీవెనలే
వెన్నెలకన్నా చల్లదనం
ఓ అన్నా మీ అనురాగం!
మల్లెలవంటీ మీ మనసులలో
చెల్లికీ చోటుంచాలీ
ఎల్లకాలమూ..ఈతీరుగనే
చెల్లిని కాపాడాలీ..ఈ..
పుట్టినరోజున మీ దీవెనలే
వెన్నెలకన్నా చల్లదనం
అన్నా నీ అనురాగం
ఎన్నొ జన్మల పుణ్యఫలం
ఓ అన్నా నీ అనురాగం
అన్నలు మీరే నా కన్నులుగా
నన్నె నడిపించాలి....
తల్లీ తండ్రీ సర్వము మీరై
దయతో జీవించాలీ..
పుట్టినరోజున మీ దీవెనలే
వెన్నెలకన్నా చల్లదనం
ఓ అన్నా మీ అనురాగం
ఎన్నొ జన్మల పుణ్యఫలం
ఓ అన్నా నీ అనురాగం
ఇల్లాలై నీ ఎచటికేగినా..
చెల్లి మదిలో నిలపాలీ...
ఆడపడుచుకూ..అన్నివేళలా..
తోడునీడగా నిలవాలీ...
పుట్టినరోజున మీ దీవెనలే
వెన్నెలకన్నా చల్లదనం
ఓ అన్నా మీ అనురాగం
ఎన్నొ జన్మల పుణ్యఫలం
ఓ అన్నా............
No comments:
Post a Comment