Tuesday, March 15, 2011

ఆడపడుచు--1967




సంగీతం::T.చలపతిరావ్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,బృందం


ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరిందీ
ఊహ ఉలికి ఉలికి పడుతోందీ...
సిగ్గు చెవిలోన గుస గుస లాడిందీ..2

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
పెళ్ళిచూపుల్లో ఏదో వెరపు..
వెళ్ళిపోయాక ఒకటే తలపు
పెళ్ళిచూపుల్లో ఏదో వెరపు..
వెళ్ళిపోయాక ఒకటే తలపు
రెండు నిముషాలలో కోటిపులకింతలై..2
నిండుమదిలోన నెలకొంది తనరూపు

మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరిందీ
ఊహ ఉలికి ఉలికి పడుతోందీ...
సిగ్గు చెవిలోన గుస గుస లాడిందీ..

ఓహో...ఓ..ఓ..ఓ..ఓ........
ఏల అదిరింది నా ఎడమకన్నూ..
ఏల తనపేరు ఊరించెనన్నూ
ఏల అదిరింది నా ఎడమకన్నూ..
ఏల తనపేరు ఊరించెనన్నూ
వలపు ఉయ్యాలపై..పూలజంపాలపై..2
ఆశ ఆకాశ వీధుల్లో ఊగింది..

మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరిందీ
ఊహ ఉలికి ఉలికి పడుతోందీ...
సిగ్గు చెవిలోన గుస గుస లాడిందీ..

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ....

ఇంత సంతోషమిపుడే కలిగే..
ఇంక రాబోవు సుఖమెంతొకలదు..
ఇంత సంతోషమిపుడే కలిగే..
ఇంక రాబోవు సుఖమెంతొకలదు..
పగటి కలలన్నియు పసిడి గనులైనచో..2
పట్టలేదేమొ నా మూగ మనసు..

మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరిందీ
ఊహ ఉలికి ఉలికి పడుతోందీ...
సిగ్గు చెవిలోన గుస గుస లాడిందీ..

No comments: