Saturday, December 03, 2011

అమెరికా అబ్బాయి--1987



సంగీతం::రాజేశ్వర రావు
రచన::C.నారాయణ రెడ్డి
గానం::P.సుశీల

ఏ దేశమేగినా..ఎందుకాలిడినా
ఏ దేశమేగినా..ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా..పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి..నిండు గౌరవము

రాయప్రోలన్నాడు ఆనాడు అది మరచిపోవద్దు ఏనాడు
పుట్టింది ఈ మట్టిలో సీత,రూపు కట్టింది దివ్య భగవత్గీత
వేదాలు వెలసిన ధరణిరా..వేదాలు వెలసిన ధరణిరా
ఓంకార నాదాలు..పలికిన అవనిరా
ఎన్నెన్నొ దేశాలు కన్ను తెరవనినాడు..వికసించె మననేల విజ్ఞాన కిరణాలు

ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము

వెన్నెలది ఏ మతమురా,కోకిలది ఏ కులమురా
గాలికి ఏ భాష ఉందిరా,నీటికి ఏ ప్రాంతముందిరా
గాలికి,నీటికి లేవు భేదాలు
మనుషుల్లో ఎందుకీ..తగాదాలు,కులమత విభేదాలు

ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము

గౌతమబుద్ధుని భోదలు మరవద్దు..గాంధీ చూపిన మార్గం విడవద్దు
గౌతమబుద్ధుని భోదలు మరవద్దు.గాంధీ చూపిన మార్గం విడవద్దు
దేశాల చీకట్లు తొలగించు..స్నేహగీతాలు ఇంటింటా వెలిగించు
ఇకమత్యమే జాతికి శ్రీరామరక్ష..అందుకే నిరంతరం సాగాలి దీక్ష
అందుకే నిరంతరం సాగాలి దీక్ష...

No comments: