సంగీతం::M.రంగారావ్
రచన::C.D.నారాయణరెడ్డి
గానం::S.జానకి
తారాగణం::హరనాధ్,గుమ్మడి,రాజనాల,శారద,విజయరాధిక,జ్యోతిలక్ష్మి,అంజలీదేవి,
పల్లవి::
ఏ నీడలో ఏమున్నదో ఏగుండెలో ఏమి దాగున్నదో
ఏ నీడలో ఏమున్నదో ఏ గుండెలో ఏమి దాగున్నదో
ఏ పుట్టలో ఏ పామున్నదో ఏ వేళ ఏమౌనో
ఏ నీడలో ఏమున్నదో ఏ గుండెలో ఏమి దాగున్నదో
ఏ పుట్టలో ఏ పామున్నదో ఏ వేళ ఏమౌనో ఏ నీడలో ఏమున్నదో
చరణం::1
పూల పొదరింటిలో ఏది పొంచున్నదో
మూగ కనుసైగలో బాసలెన్నున్నవో
పూల పొదరింటిలో ఏది పొంచున్నదో
మూగ కనుసైగలో బాసలెన్నున్నవో
గాలించే కనులుంటే ఈ లోకం విషవలయం
ఏ నీడలో ఏమున్నదో ఏ గుండెలో ఏమి దాగున్నదో
ఏ పుట్టలో ఏ పామున్నదో ఏ వేళ ఏమౌనో
ఏ నీడలో...ఏమున్నదో
చరణం::2
ఏటి కెరటాలలో ఎన్ని రొదలున్నవో
నేటి నా పాటలో ఎన్ని నిట్టూర్పులో
ఏటి కెరటాలలో ఎన్ని రొదలున్నవో
నేటి నా పాటలో ఎన్ని నిట్టూర్పులో
గమనించే మనసుంటే ప్రతి నిమిషం ఒక ప్రళయం
ఏ నీడలో ఏమున్నదో ఏ గుండెలో ఏమి దాగున్నదో
ఏ పుట్టలో ఏ పామున్నదో ఏ వేళ ఏమౌనో
ఏ నీడలో...ఏమున్నదో
No comments:
Post a Comment