Saturday, January 28, 2012

దేవదాసు--1974

సంగీతం::రమేష్‌నాయుడు
రచన::ఆరుద్ర
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య 

పల్లవి::

మేఘాల మీద సాగాలి..అనురాగాల రాశిని చూడాలి 
నే పదం పాడుతూ ఉరకాలి నువు కదం తొక్కుతూ ఎగరాలి 
ఆహాహా ఆహాహాహహా ఓహోహో ఓహోహో
చల్ రే బేటా చల్..అరె చల్ రే బేటా చల్ 
చల్ రే బేటా చల్..అరె చల్ చల్ రే బేటా చల్

చరణం:1

చిన్ననాటి ఆ చిలిపితనంకన్నె వయసులో పెరిగిందా 
వన్నెల చిన్నెల పడుచుతనం వాడిగా పదును తేరిందా 
తెలుసుకోవాలి కలుసుకోవాలిపారును నా పారును 
మేఘాల మీద సాగాలి అనురాగాల రాశిని చూడాలి 
నే పదం పాడుతూ ఉరకాలి నువు కదం తొక్కుతూ ఎగరాలి 
ఆహాహా ఆహాహాహహా ఓహోహో ఓహోహో
చల్ రే బేటా చల్..అరె చల్ రే బేటా చల్ 
చల్ రే బేటా చల్..అరె చల్ చల్ రే బేటా చల్

చరణం::2

ఆమెకు ఎంతో అభిమానం అయినా నేనే ప్రాణం 
నా మొండితనంలో తీయదనం ఆ చెవులకు మురళీగానం 
ఏడిపించాలి కలసి నవ్వాలి  పారుతో..నా పారుతో
మేఘాల మీద సాగాలి అనురాగాల రాశిని చూడాలి 
నే పదం పాడుతూ ఉరకాలి నువు కదం తొక్కుతూ ఎగరాలి 
ఆహాహా ఆహాహాహహా ఓహోహో ఓహోహో
చల్ రే బేటా చల్..అరె చల్ రే బేటా చల్ 
చల్ రే బేటా చల్..అరె చల్ చల్ రే బేటా చల్

No comments: