http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1851
సంగీతం::చక్రవర్తి
రచన::రాజశ్రీ
గానం::P.సుశీల,S.P.బాలు
Film Directred By::Dasari Narayana Rao
తారాగణం::అక్కినేని,సుజాత,జగ్గయ్య,ప్రభాకర రెడ్డి,జయసుధ,జయప్రద
పల్లవి::
అహ..హా..హా
అహహహ..ఆ ఆ ఆ హా
ఇది మేఘ సందేశమో..అనురాగ సంకేతమో
ఆ..ఆ..ఇది మేఘ సందేశమో..అనురాగ సంకేతమో
చిరుజల్లు కురిసింది విను వీధిలో
చిరుజల్లు కురిసింది విను వీధిలో
హరివిల్లు విరిసింది తొలి ప్రేమలో
ఇది మేఘ సందేశమో..అనురాగ సంకేతమో
చరణం::1
అహ..హా..హా
అహహహ..ఆ ఆ ఆ హా
వెల్లువలా పొంగే నా పాల వయసు
పల్లవి పాడేను నా మూగ మనసు
వెల్లువలా పొంగే నా పాల వయసు..ఆ..ఆ..ఆ
పల్లవి పాడేను నా మూగ మనసు
నీ పాట నా బాట కావాలని
ఆ నింగి ఈ నేల కలవాలని
చినుకులు వేశాయి ఒక ఒంతెన
చినుకులు వేశాయి ఒక ఒంతెన
కలిసిన హృదయాలకది దీవెనా
ఇది మేఘ సందేశమో..అనురాగ సంకేతమో
చరణం::2
తడిసిన తనువేదో కోరింది స్నేహం
కలిగెను జడి వాన నాకు దాహం
తడిసిన తనువేదో కోరింది స్నేహం
ఆ..హా..కలిగెను జడి వాన నాకు దాహం
నీ చెంత మేను మరవాలనీ
నీ కంటిలో పాప కావాలనీ
వలపులు చేశాయి వాగ్ధానము..హా..ఆ..ఆ
వలపులు చేశాయి వాగ్ధానము
మనకివి సిరులింక కలకాలము
ఇది మేఘ సందేశమో..అనురాగ సంకేతమో
చిరుజల్లు కురిసింది విను వీధిలో
చిరుజల్లు కురిసింది విను వీధిలో
హరివిల్లు విరిసింది తొలి ప్రేమలో
ఇది మేఘ సందేశమో..అనురాగ సంకేతమో
No comments:
Post a Comment