Sunday, March 23, 2014

మంగమ్మ శపధం--1965















సంగీతం::T.V.రాజు
రచన::సినారె
గానం::P.సుశీల
తారాగణం:N.T.రామారావు, జమున,రేలంగి, గిరిజ,రాజనాల, ఎల్.విజయలక్ష్మి

పల్లవి::

అందాల నా రాజ అలుకేలరా 
ఔనని కాదని అనవేలరా..ఆ..ఆ
అందాల నా రాజ అలుకేలరా 
ఔననీ..కాదని అనవేలరా..ఆ..ఆ
అందాల నా రాజ అలుకేలరా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

చరణం::1

చందురుడాపైన సందడి చేసేను 
డెందములోలోన తొందర చేసేను
అందని వలపులు గంధము పూసేను
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
అందని వలపులు గంధము పూసేను 
సుందరి జాలిగ చూసేనురా..ఆ
అందాల నా రాజ అలుకేలరా..ఆ

చరణం::2

మరులను చిలికించు చిరునవ్వులేమాయే
మనసును కవ్వించు కనుసన్నలేమాయే
మదనుని తూపులు మరి మరి పదునాయే
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
మదనుని తూపులు మరి మరి పదునాయే 
మౌనము చాలించి నన్నేలరా..ఆ
అందాల నా రాజ అలుకేలరా
ఔననీ..కాదని అనవేలరా
అందాల నా రాజ అలుకేలరా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

No comments: