Sunday, March 02, 2014

సి.ఐ.డి.(C. I. D.)--1965

సంగీతం::ఘంటసాల
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::ఘంటసాల, P.సుశీల

పల్లవి::

నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే
తెలిసినదేమో తలచినకొలదీ పులకలు కలిగెనులే
నీకూ నాకూ వ్రాసివున్నదని ఎపుడో తెలిసెనులే
తెలిసినదేమో తలచినకొలదీ కలవరమాయెనులే
నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే

చరణం::1

నా హృదయమునే వీణజేసుకొని
ప్రేమను గానము చేతువనీ 
నా హృదయమునే వీణజేసుకొని
ప్రేమను గానము చేతువనీ
నా గానము నా చెవి సోకగనే నా మది నీదై పోవుననీ
నీకూ నాకూ వ్రాసి వున్నదని ఎపుడో తెలిసెనులే
తెలిసినదేమో తలచినకొలదీ కలవరమాయెనులే
నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే

చరణం::2

నను నీ చెంతకు ఆకర్షించే గుణమే నీలో ఉన్నదనీ 
నను నీ చెంతకు ఆకర్షించే గుణమే నీలో ఉన్నదనీ
ఏ మాత్రము నీ అలికిడి ఐనా నా ఎద దడదడలాడుననీ
ఏ మాత్రము నీ అలికిడి ఐనా నా ఎద దడదడలాడుననీ
నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే
తెలిసినదేమో తలచిన కొలదీ కలవరమాయెనులే

నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే
తెలిసినదేమో తలచినకొలదీ పులకలు కలిగెనులే
నీకూ నాకూ వ్రాసివున్నదని ఎపుడో తెలిసెనులే
తెలిసినదేమో తలచినకొలదీ కలవరమాయెనులే

No comments: