సంగీతం::R.సుదర్శనం
రచన::తోలేటి
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు,S.V.రంగారావు,అంజలీ దేవి,వైజయంతీమాల,నాగయ్య
పల్లవి::
ఓంకార నాదస్వరూపా..ఆ ఆ ఆ ఆ
భావరాగ తాళప్రదీపా..ఆ ఆ ఆ
నాట్యకలాపా..ఆ..నటరాజా
నమోనమో..నటరాజా..నమోనమామి
ఇలలోసాటిలేని భారతదేశం
ఇలలోసాటిలేని భారతదేశం
మా దేశం ఇలలోసాటిలేని భారతదేశం
కనులకు సుందరం..కళలకు మందిరం
మాదేశం సుందరం..కళలకు మందిరం
మాదేశం సుందరం..కళలకు మందిరం
ఇలలోసాటిలేని..భారతదేశం
చరణం::1
పావన హిమశైలం..గౌరి కిరీటం
పావన హిమశైలం..గౌరి కిరీటం
నిర్మల గంగానది..జీవ ప్రవాహం
దక్కను వజ్రాల..పచ్చలహారం
దక్కను వజ్రాల..పచ్చలహారం
మా కాశ్మీరం..రమ్యారామం
మా కాశ్మీరం..రమ్యారామం
ఇలలోసాటిలేని..భారతదేశం
చరణం::2
భగవద్గీత..ఆ..ఆ..ఆ..
భగవద్గీత..వేదనినాదం
గౌతమ బుద్ధుని..జ్ఞానప్రదీపం
భగవద్గీత..వేదనినాదం
గౌతమబుద్ధుని..జ్ఞానప్రదీపం
రామకృష్ణబోధలో..అమృతసారం
రామకృష్ణబోధలో..అమృతసారం
దేశాల వెదజల్లే..దివ్యప్రదేశం
దేశాల వెదజల్లే..దివ్యప్రదేశం
ఇలలోసాటిలేని..భారతదేశం
మా దేశం..ఇలలోసాటిలేని..భారతదేశం
చరణం::3
కాళిదాసకావ్యం జయదేవుని గానం
కాళిదాసకావ్యం జయదేవుని గానం
అజంత ఎల్లోరా అద్భుతశిల్పం
గాంధి రవీంద్రుల..ఘన సందేశం
గాంధి రవీంద్రుల..ఘన సందేశం
ఖండ ఖండముల..చాటే దేశం
ఖండ ఖండముల..చాటే దేశం
ఇలలోసాటిలేని..భారతదేశం
మా దేశం..ఇలలోసాటిలేని..భారతదేశం
No comments:
Post a Comment