Thursday, November 03, 2011

వాడేవీడు--1973













సంగీతం::సత్యం
రచన::దేవులపల్లికృష్ణశాస్రీ
గానం::ఘంటసాల,P.సుశీల,S.జానకి
తారాగణం::N.T.R.,మంజుళ,నాగభూషణం,పద్మనాభం,కృష్ణంరాజు,పండరీబాయ్,లీలారాణి.

పల్లవి::

నేటికి మళ్ళీ మా యింట్లో ఎంచక్కా పండుగా 
ఏటేటా నూరేళ్ళూ..మల్లీ మల్లీ పండుగా
తొలిదీపం వెలిగించిన...రోజు 
ఇలవేలుపు దిగివచ్చిన...రోజు
నేటికి మళ్ళీ మా యింట్లో ఎంచక్కా పండుగా 
ఏటేటా నూరేళ్ళూ..మల్లీ మల్లీ పండుగా

చరణం::1

ముంగిట్లో మందారం మురిసి మురిసి నవ్విందీ
ముంగిట్లో మందారం మురిసి మురిసి నవ్విందీ 
నట్టింట్లో యీ మోడు తిరిగి చిగురు తొడిగింది
నట్టింట్లో యీ మోడు తిరిగి చిగురు తొడిగింది 
నినుచూసి నన్ను చూసి...నినుచూసి 
నన్ను చూసి...మనభాగ్యం చూసిచూసి 
నేటికి మళ్ళీ మా యింట్లో ఎంచక్కా పండుగా 
ఏటేటా నూరేళ్ళూ..మల్లీ మల్లీ పండుగా
ఏటేటా నూరేళ్ళూ..మల్లీ మల్లీ పండుగా 

చరణం::2

ఆఆఆఆఆఆఆఆఆఆ..ఆఆఆఆఆఆఆఆఆఆ
ఆఆఆఆఆఆఆఆఆఆ..ఆఆఆఆఆఆఆఆఆఆ
ఇన్నాళ్ళకు..కనుగొన్నాను కన్నతల్లి 
కారుణ్యం..మా చిన్నచెల్లి అనురాగం
యీ గుడిలో దివ్వెగనైనా యీ గూటిలో గువ్వగనైనా 
ఇల్లువిడిచి పోలేను..యీ వరం వదులుకోలేను 
నేటికి మళ్ళీ మా యింట్లో ఎంచక్కా పండుగా 
ఏటేటా నూరేళ్ళూ..మల్లీ మల్లీ పండుగా

No comments: