సంగీతం::B.శంకర్
రచన::దేవులపల్లి
గానం::ఘంటసాల
Film Directed By::Addala NarayanaRao
తారాగణం::కృష్ణ,జమున,గుమ్మడి,జి.వరలక్ష్మి,విజయలలిత,ముక్కామల
పల్లవి::
మనిషైతే..మనసుంటే..
మనిషైతే మనసుంటే..కనులు కరగాలిరా
కరిగి కరుణ కురియాలిరా..కురిసి జగతి నిండాలిరా
చరణం::1
ఆగి ఆగి సాగి పోరా..సాగిపోతూ చూడరా..ఆ..
ఆగి ఆగి సాగి పోరా..సాగిపోతూ చూడరా..ఆ..
వేగిపోయే ఎన్నెన్ని బ్రతుకులో..వేడుకుంటూ ఎన్నెన్ని చేతులో
వేచి ఉన్నాయిరా..
మనిషైతే మనసుంటే
మనిషైతే మనసుంటే..కనులు కరగాలిరా
కరిగి కరుణ కురియాలిరా..కురిసి జగతి నిండాలిరా
చరణం::2
తూలిపోతు నీలి మేఘం..జాలి జాలిగ కరిగెరా
తూలిపోతు నీలి మేఘం..జాలి జాలిగ కరిగెరా
కేలు చాపి ఆ దైవమే తన..కేలు చాపి ఆకాశమే
ఈ నేల పై ఒరిగెరా
మనిషైతే..మనసుంటే
మనసుంటే వైకుంఠమే ఒరుగురా
నీకోసమే కరుగురా..
నీకోసమే కరుగురా..
నీకోసమే కరుగురా..
No comments:
Post a Comment