Monday, November 09, 2009

రాధమ్మ పెళ్ళి--1974
























సంగీత::రమేష్ నాయుడు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,L.R.అంజలి
తారాగణం::కృష్ణ,మురళీ మోహన్,శారద,నిర్మల,సత్యనరాయణ, రమాప్రభ,రేలంగి,అల్లురామలింగయ్య,రజబాబు.

పల్లవి::

సంకురాత్రి అల్లుడూ..సంకలెగరేస్తు వచ్చిండు 
సందకాడ దాకా..ముడుసుకోని కూకున్నడు
మూతి ముడుసుకుని..కూకున్నాడు 
మూతి ముడుసుకుని..కూకున్నాడు
ఎందుకే ఓలమ్మీ ఎందుకే..ఎందుకే ఓలమ్మీ ఎందుకే 

వస్తానన్న బావమర్ది..రాలేదని 
తెస్తానన్న ర్యాలీ సైకిల్.. తేలేదని
ఇస్తానన్న రిస్టువాచీ..ఇస్తారో లేదోనని 

సంకురాత్రి అల్లుడూ..ముడుసుకోని కూకున్నడు 
మూతి ముడుసుకుని..కూకున్నాడు 
మూతి ముడుసుకుని..కూకున్నాడు      
అందుకే ఓలమ్మీ అందుకే అందుకే ఓలమ్మీ అందుకే            

వెన్నెల్లో తానే..పక్కేసింది
ఆ పక్కమీద మల్లెపూలు..పరిచేేసింది
ఇన్నీ చేేసింది..ఎంతకు రాదేమి
ముడుసుకొని కూకుందో..సంకురాత్రి పిల్ల
ఏ మూలనో నక్కిందో..సంకురాత్రి పిల్ల 
ఏ మూలనో నక్కిందో..సంకురాత్రి పిల్ల

ముడుసుకొనే..కూకున్నాను
మూలనే..ఏ..కూకున్నాను
ఎందుకు కూకున్నానో..చెప్పేది కాదు
చెప్పినా నీకది..తెలిసేది కాదు..హా హా 
చెప్పినా నీకది తెలిసేది కాదు..సంకలెగరేసు వచ్చిండు 
మూడు రోజు లేట్టా అని..ముడుసుకొని కూకున్నాడు 
మూతి ముడుసుకుని..కూకున్నాడు..ఊఊఊ 

1 comment:

smartkram said...

రాధమ్మ పెళ్లి చిత్రంలోని అన్నీ వీడియో పాటలను ఇక్కడ వీక్షించండి:

https://www.youtube.com/playlist?list=PLMWZNMZrl8xfmd4IvZl7FqOI_EweH6pd5

మీ కృషికి ధన్యవాదాలు.